జూ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కలిసి ఆయన రాజకీయం నడిపేందుకు సిద్ధపడుతున్నట్లు, ఈ మేరకు జగన్‌తో చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. 2014లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా, అందుకు చంద్రబాబు అధికారంలోకి రాకుండా చూసే విధంగా, 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేజక్కించుకునే ప్రణాళికను జూనియర్ ఎన్టీఆర్ రచించుకున్నట్లు చెబుతున్నారు. ఇందులోని వాస్తవాస్తవాలను చెప్పడానికి తగిన సమాచారం లేదు. కానీ, ఇందుకు అవకాశాలున్నాయనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
కాగా, చంద్రబాబుపై తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని తిరుగుబాటు చేస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డితో ఏమైనా సంబంధం ఉందా అనే విషయం కూడా చర్చనీయాంశంగానే ఉంది. నాగం జనార్దన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి వైయస్ జగన్‌తో అవగాహనకు వస్తారనే మాట బలంగా వినిపిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి ఈ కార్యాచరణకు హరికృష్ణకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇటీవలి పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశానికి కూడబలుక్కున్నట్లుగా హరికృష్ణ, నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. హరికృష్ణ సమావేశం మధ్యలోనే వెళ్లిపోగా, నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబుతో వాగ్వివాదానికి దిగారు. దీన్నిబట్టి కూడా వీరిద్దరు చంద్రబాబును వ్యతిరేకించేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో నెట్టుకు రావడం జగన్‌కు గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు గానీ ఇబ్బంది ఉండదు. కానీ తెలంగాణ విషయంలోనే సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. ఈ మూడు ముక్కలాటలో నాగం జనార్దన్ రెడ్డి పాత్ర కూడా జూనియర్ ఎన్టీఆర్ వ్యూహంలో భాగంగానే జరుగుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, కాంగ్రెసు పార్టీని తీవ్రంగా దెబ్బ తీసేందుకు జగన్, నాగం జనార్దన్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ రంగంలోకి దిగుతుందేమోనని అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications