సూరి హత్యకు భాను ప్లాన్ ఎలా?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మన్మోహన్ భానుకు గన్‌మన్‌గా వ్యవహరిస్తున్నాడు. మన్మోహన్‌ను హైదరాబాదు శివారులోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతను 2004లో ఇటావాలో స్థానిక శాసనసభ్యుడి సహకారంతో గన్ లైసెన్స్ పొందినట్లు తెలుస్తోంది. 2006లో అతను దానికి ఆలిండియా పర్మిట్ తీసుకున్నట్లు బయటపడింది. 2008లో భాను వద్ద అతను గన్‌మన్‌గా చేరినట్లు చెబుతున్నారు. సూరిని హత్య చేస్తున్న విషయం భానుకు ఓ రోజు ముందు చెప్పాడని అంటున్నాడు. సుబ్బయ్యకు మాత్రం నెల రోజుల ముందే తెలుసునట. పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పిస్తానని భాను మన్మోహన్‌కు హామీ ఇచ్చాడని అంటున్నారు.
కాగా, సూరి హత్యకు చాలా రోజుల ముందు నుంచే భాను ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. సూరి హత్యకు ముందు రోజు భాను వేషం మార్చుకున్నాడట. వారం రోజుల ముందు హైదరాబాదు సమీపంలోని కొండాపూర్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తి నుంచి భాను రెండు గన్‌లు తీసుకున్నట్లు చెబుతున్నారు. సూరి హత్య చేసిన తర్వాత భాను షోలాపూర్, ఇటావాల మీదుగా గుర్గావ్ పారిపోయినట్లు చెబుతున్నారు. జనవరి 20వ తేదీ వరకు గుర్గావ్‌లో పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీను కూడా చాలా అక్కడే ఉన్నాడని సమాచారం. మొద్దు శీనుకు ఆ ఆశ్రయం చూపించింది భాను కిరణే అనే విషయం ప్రచారంలో ఉంది. మొత్తం మీద, పకడ్బందీ ప్లాన్ ప్రకారమే సూరిని భాను హత్య చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications