జగన్‌కు బిజెపి దోస్తీ కలిసి వస్తుందా?

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా అనుభవం తనకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే ఆయన బిజెపి పక్కన చేరుతున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు పక్కనో, బిజెపి పక్కనో ఉన్నంత కాలం మధు కోడాకు ఏ విధమై ఇబ్బంది కలగలేదు. రెండు పార్టీలను సవాల్ చేస్తూ స్వతంత్రంగా రాజకీయం చేయడం ప్రారంభించగానే మధు కోడాపై కేసుల పరంపర, అరెస్టు వంటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బిజెపితో స్నేహం వల్ల తనకు అనుకోని ఇబ్బందులు ఎదురైనా పార్టీని విజయపథంలో నడిపించడానికి వీలవుతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ జగన్ అరెస్టయితే పులివెందుల శానసభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ముందు పెట్టి పార్టీని విజయపథంలో నడిపించాలనే ఆలోచన ఉంది. దీంతో అనుచరులు మాత్రమే సరిపోరని, అందుకు పటిష్టమైన నాయకత్వం గల జాతీయ పార్టీ అండదండలు అవసరమని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై కక్ష తీర్చుకోవడానికి ఆ రెండు పార్టీలను ఓడించడం జగన్ ప్రధాన లక్ష్యంగా మారినట్లు చెబుతున్నారు. అందుకే బిజెపితో స్నేహానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే, బిజెపితో స్నేహం వల్ల జగన్‌కు కొంత మేరకు ఊరట లభించే అవకాశాలు కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications