జగన్ పార్టీలోకి రెడ్డి బ్రదర్స్?

బిజెపి అగ్రనాయకత్వం గాలి సోదరులను దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ను గాలి బ్రదర్స్ తమ మాతగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా వారిని దూరం పెట్టారు. గాలి సోదరులతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆమె గతంలో ఓసారి చెప్పారు. బళ్లారిలో గాలి సోదరులు సత్తా చాటుతున్నప్పటి నుంచి - అంటే 1999 నుంచి యేటా సుష్మా స్వరాజ్ బళ్లారి సందర్శిస్తూ వచ్చారు. వరలక్ష్మి వ్రతానికి ఆమె ఏటా హాజరయ్యేవారు. అయితే, తన మామ మరణించడంతో 2008 మాత్రం సుష్మా స్వరాజ్ బళ్లారి రాలేదు. ఈ నెల 12వ తేదీన జరిగిన వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే రాలేదు. అయితే, గాలి బ్రదర్స్ ఆంధ్రకు వస్తారా, కర్ణాటకలో వైయస్సార్ కాంగ్రెసు శాఖను ఏర్పాటు చేస్తారా అనేది తేలడం లేదు.












Click it and Unblock the Notifications