వాస్తవాన్ని అంగీకరించిన వైయస్ జగన్

గుంటూరు జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్రను ప్రారంభించిన ఆయన బుధవారం ఆ మాటన్నారు. దీన్నిబట్టి వాస్తవం జగన్ గ్రహించారని అంటున్నారు. జగన్ వెంట ఉన్న ఆళ్ల నాని తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆళ్ల నాని కోరికలను అన్నింటినీ తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధపడ్డారు. ఇలా జగన్ వెంట వెళ్లిన శానససభ్యులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదనే ఉద్దేశంతో వెనక్కి రావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది శాసనసభ్యులు తమ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తమ రాజీనామాలను ఆమోదిస్తే మళ్లీ పోటీ చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్ దొరుకుతుందా లేదా, పోటీ చేసే అవకాశం దొరికితే ఖర్చులు ఎవరు భరిస్తారు వంటి సందేహాలు కొంత మంది శాసనసభ్యులను పిడిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై జగన్ ఏ విధమైన హామీ ఇవ్వకపోవడం కూడా వారిని పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలోని పలు శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే వాతావరణం నెలకొంది. తెలంగాణ శాసనసభ్యులు చేసిన రాజీనామాలను కొన్నింటిని ఆమోదించే పనిలో స్పీకర్ పడ్డారు. పార్టీలకు కూడా రాజీనామాలున చేసి ఇతర పార్టీల్లో చేరిన శాసనసభ్యుల రాజీనామాలను ఆయన ఆమోదిస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో మరిన్ని రాజీనామాలు ఆమోదం పొందే పరిస్థితి ఉంది. ఆ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చర్చ జరుగుతోంది. మంగళవారం వైయస్ జగన్‌తో కొంత మంది శాసనసభ్యులు ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి చెప్పకపోవడం వల్ల పోటీ చేసే పరిస్థితి లేదని, పోటీ చేసినా ఫలితం పెద్దగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కూడా జగన్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications