తెరాస ముసుగులో జగన్ వర్గం?

వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులు తెలంగాణ ప్రాంతంలో దండిగానే ఉన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు చాలా మంది వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం బలంగానే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైయస్ జగన్ కోవర్టులంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి పలు మార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి తెలంగాణకు చెందిన నాయకులు సిద్ధంగా ఉన్నప్పటినకీ జగన్ తెలంగాణ వైఖరి అందుకు అనుమతించడం లేదు.
జగన్ వైపు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన వర్గం నాయకులు కె. చంద్రశేఖ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్, జగన్ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి, మధ్యంతర ఎన్నికలు తేవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసులో చేరాల్సిన నాయకులు తెరాస వెనక ర్యాలీ అవుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తే జగన్ పార్టీలోకి వెళ్లేవారెవరో తేలిపోతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications