ఢిల్లీ స్థాయిలో జగన్ లాబీయింగ్?

జగన్‌పై కాంగ్రెసు అధిష్టానానికి ఉన్న ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఇంకా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక పాత్ర వహిస్తూ జగన్‌కు సమీప బంధువైన ఓ నాయకుడు అందుకు ఢిల్లీలోనే మకాం పెట్టినట్లు చెబుతున్నారు. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే నేతలతో, రాహుల్ గాంధీ కోటరీలోని యువనేతలతో ఆయన నిరంతరం మాట్లాడుతున్నట్లు సమాచారం. వైయస్ జగన్ తొందర పడ్డారని, క్షమించి వదిలేయాలని ఆయన వేడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని జగన్ ఇబ్బంది పెట్టబోరని కూడా ఆయన హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రజాప్రతినిధి వైయస్ జగన్ తరఫున కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో రాయబారానికి ప్రయత్నిస్తున్న నాయకుడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ విషయాన్ని పట్టించుకోవద్దని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు రాష్ట్ర నాయకులకు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానంపై గానీ, సోనియాపై గానీ ఏ మాత్రం విమర్సించకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.












Click it and Unblock the Notifications