55 మందితో జగన్ పక్కా ప్లాన్?

YS Jagan
అవిశ్వాస తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. శానససభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి కావడంతో అందరి దృష్టి అవిశ్వాస తీర్మానంపై పడింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు కాంగ్రెసు పార్టీకి సహకరించిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానం సందర్భంలో సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ వెంట పక్కాగా 29 మంది శానససభ్యులున్నారని, వారి జాబితా తమ వద్ద ఉందని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ చెబుతోంది. మరో 8 మంది శాసనసభ్యులు జగన్‌తో టచ్‌లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అంటే, జగన్ వెంట 37 మంది శాసనసభ్యులున్నారని చెప్పవచ్చు.

ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ వద్ద 40 మంది శాసనసభ్యులు ఉంటే సరిపోతుందని వైయస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసి వస్తే ఆ బలం సరిపోతుందని ఆయన అనుకుంటున్నారు. అయితే, కనీసం 55 మంది శాసనసభ్యులను కూడగట్టి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన 60 మంది శాసనసభ్యులపై దృష్టి పెట్టారని, వారిలో 55 మంది వచ్చినా సరిపోతుందని భావిస్తున్నారని అంటున్నారు. దీనికి విరుగుడుగా అధికార కాంగ్రెసు పార్టీ ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తుందనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఏ విధమైన డోకా లేదని, అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి తీరుతామని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.

ఇంతకు ముందు ఇచ్చిన నోటీసు చెల్లకపోవడంతో తెలుగుదేశం పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును మరోసారి శనివారం ఉదయం ఇచ్చింది. తెలంగాణ అంశంపై సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+