వైయస్ దూకుడు, జగన్ మంకుపట్టు

అంతేకాదు, కాంగ్రెసులోని సీనియర్ల మాటను కూడా వినని స్థితికి చేరుకున్నారు. చాలా మంది ముఖ్యమైన అనుచరులను దూరం చేసుకున్నారు. మరణించిన తర్వాత మాట్లాడకూడదనే ఒక సెంటిమెంటు తప్ప వైయస్సార్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలా మందే సిద్ధంగా ఉన్నారు. దానికితోడు, వైయస్సార్‌కు ప్రజల్లో ఆదరణ ఉంది. దానివల్ల కూడా కాంగ్రెసులోని చాలా మంది వైయస్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వైయస్ హయాంలో కాంగ్రెసులో రెండు పక్షాలుగా కాంగ్రెసు చీలిపోయింది. జూనియర్లు వైయస్‌కు హన్మద్భక్తులయ్యారు. సీనియర్లు రుసరుసలాడుతూ వచ్చారు. వి. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు ముఖం పట్టుకుని కూడా విమర్సించారు. అయినా వైయస్ లెక్క చేయలేదు.
ఆ స్థితిలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సాక్షి పత్రిక, చానెల్ స్థాపన ద్వారా ఆయన పూర్తిగా వెలుగులోకి వచ్చారు. కానీ, వైయస్ హయాంలో అన్ని స్థాయిల్లో, అన్ని వర్గాల్లో జగన్ అనుచరులు, అనుయాయులు తయారయ్యారు. వైయస్ అధికారాన్ని, వైయస్ జగన్ చొరవను ఆసరా చేసుకుని తామూ లాభపడేందుకు సిద్ధపడ్డారు. అలా వ్యాపార సామ్యాజ్యంలో వైయస్ జగన్‌కు పెద్ద సైన్యమే తయారైంది. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన పార్లమెంటు సభ్యుడిగా చాలా తక్కువ కాలంలో ఎదిగారు. ఇదంతా ఆయన వ్యాపార దక్షత అని అనుచరగణం ప్రచారం చేస్తూ రాగా, వాటి వెనక వ్యవహారాలేమిటో ప్రత్యర్థులు పసిగడుతూ వచ్చారు. చివరికి జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం మంకు పట్టు పట్టి, కాంగ్రెసు నుంచి బయటకు రావడంతో ప్రత్యర్థులకు మంచి అవకాశం లభించింది. అయితే, చూసి చూసి నిప్పుల్లో ఎవరూ దూకరు కదా, కెవిపి రామచందర్ రావు వంటివారు కూడా జగన్ వెంట నడవలేకపోయారు.


Click it and Unblock the Notifications