అఖిలేష్ ఎఫెక్ట్: వైయస్ జగన్, నారా లోకేష్....

కాగా, యుపి ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న సూచనలు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో నగదు బదిలీ పథకానికి రూపకల్పన చేసింది నారా లోకేషేనని చెబుతారు. ఆ పథకాన్ని ప్రజల్లోకి అప్పటి ఎన్నికల సమయంలో సరిగా తీసుకుని వెళ్లి ఉంటే విజయం తమకు దక్కి ఉండేదని కూడా చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి నందమూరి కుటుంబ సభ్యుల్లోని హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఆటంకంగా మారారు. ఈ ఆటంకాన్ని నారా లోకేష్ ఏ విధంగా అధిగమిస్తారనేది చూడాల్సి ఉంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖర రావుకు కూడా తనయుడు కెటి రామారావు తోడునీడగా నిలువడమే కాకుండా అవసరమైతే పార్టీ పగ్గాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రికి రాజకీయాల్లో పని భారం తగ్గించి, వ్యూహరచనలో కూడా కెటి రామారావు మునిగి తేలుతున్నారు. కెసిఆర్ కూతురు కవిత కూడా రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని తీసుకోవడానికి సోదురుడి కెటి రామారావుతో పోటీ పడుతున్నారు. మరోవైపు, కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావుకు కెటి రామారావుకు మధ్య విభేదాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇక, కాంగ్రెసులో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శానససభ్యుల తనయులు రాజకీయ ఆరంగేట్రానికి ముందుకు వస్తున్నారు. మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్, మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, మరో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెసు నాయకులకు చెందిన వారసులు పలువురు తమ రాజకీయాలకు పదును పెడుతున్నారు.












Click it and Unblock the Notifications