రాష్ట్రపతి ఎన్నిక: మద్దతుపై చంద్రబాబు డైలమా

Chandrababu Naidu
రాష్టప్రతి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని డైలమాలో పడేశాయి. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి యుపిఎ నాయకత్వం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తుంటే, అది రాష్ట్రంలోని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు సమస్యగా మారాయి. ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇటీవల మీడియా సమావేశంలో సూచనప్రాయంగా వెల్లడించారు.

అయితే కార్పొరేట్ కంపెనీలను నిర్వహించే తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని పార్టీలో కొందరు సీనియర్లు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం సిద్ధాంతం కాంగ్రెస్ వ్యతిరేకత అనే విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్‌కు ఎలా ఓటు వేస్తారని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని, కాంగ్రెస్‌లో వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెసులో విలీనమవుతుందని తెలుగుదేశం పార్టీ ఇంత కాలం ప్రచారం సాగిస్తూ వచ్చింది. ఈ స్థితి తామే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రజల్లో విలువ ఏముంటుందని తెలుగుదేశం సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. యుపిఏ అభ్యర్థిని కాదని బిజెపి బలపరిచిన సంగ్మాకు ఓటు వేస్తే, టిడిపి బిజెపితో చేతులు కలిపారనే విమర్శ ఎదుర్కోవలసి వస్తుందని పార్టీ నాయకులతో చంద్రబాబు అంటున్నారు. ఇప్పటి వరకు మైనారిటీలు టిడిపి వైపు పెద్దగా రాలేదని, ఇప్పుడు ఎన్‌డిఏ అభ్యర్థికి ఓటు వస్తే మైనారిటీలు ఇక నమ్మరని కొందరు నాయకులు వాదిస్తున్నారు.

చంద్రబాబు సైతం ఎన్‌డిఏ అభ్యర్థిని బలపరిచేది లేదని, ఎనిమిదేళ్ల నుంచి లౌకిక వాదం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఓటింగ్‌ను బహిష్కరించే ప్రసక్తి లేదనీ ఆయనే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రణబ్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడం మినహా తమకు మరో గత్యంతరం లేదని అంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీలో కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి స్థితిలో తటస్థంగా ఉండడం మంచిదని సీనియర్లు చంద్రబాబుకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ యుపిఏకు మద్దతు ఇస్తే ఆయనను ఇరకాటంలో పెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుందని తెలుగుదేశం సీనియర్ నాయకులు చంద్రబాబుతో అంటున్నారు.

తటస్థంగా ఉండడం కన్నా మించిన మంచి నిర్ణయం ప్రస్తుత స్థితిలో ఉండదని తెలుగుదేశం సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే, చంద్రబాబు అందుకు సిద్ధపడుతారా అనేది అనుమానమే. మొత్తం మీద చంద్రబాబుకు రాష్ట్రపతి ఎన్నికలు తలనొప్పినే తెచ్చిపెట్టాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+