తెలంగాణ ఎజెండాను హైజాక్ చేస్తున్న బాబు

ఇదిలా వుంటే, తెలంగాణపై తమ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఏం చేసినా చంద్రబాబు గతంలో నోరు మెదిపేవారు కాదు. కానీ, ఈసారి తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల తరఫున పూర్తిగా తానే వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడారు.
మరో ప్రధానమైన మలుపు కూడా తీసుకున్నట్లు ఆయన కనిపించారు. 2014 ఎన్నికల లోపు తెలంగాణ ఇచ్చినా తమకు రాజకీయంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ పారేశారు. రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీ బలంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కాంగ్రెసు పార్టీదేనని అంటూ వచ్చిన చంద్రబాబు కాస్తా మెట్టు దిగినట్లు కనిపించారు. ఈ ప్రకటనకు తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు పెదవి విప్పడం లేదు. చంద్రబాబు అంతరంగం తెలుసు కాబట్టే వారు వ్యతిరేకించడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications