ఒకేసారి చిరు, రాహుల్ మన్మోహన్ టీమ్‌లోకి

పలు శాఖలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. విలాస రావు దేశ్‌ముఖ్ మృతి, అవినీతి ఆరోపణలతో వీరభద్ర సింగ్ రాజీనామా, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి కావడం వంటి కారణాల వల్ల మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడ్డాయి. మనీష్ తివారీ, ఆస్కార్ ఫెర్నాండేజ్, జనార్దన ద్వివేది, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విలాస్ ముత్తెంవార్ క్యాబినెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈసారి మంత్రివర్గం విస్తరణలో రాష్ట్రపతి పదవి కోసం పోటీపడిన తన తండ్రి సంగ్మాకు ప్రచారం చేసిన అగాథా సంగ్మాపై వేటు పడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని ఎన్సీపి తమ కోసం అడిగే అవకాశాలున్నాయి. విదేశీవ్యవహారాల శాఖామంత్రి నుంచి ఎస్‌ఎం కృష్ణ ఉద్వాసన పలుకుతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, డిఎంకె విషయంలో కాంగ్రెసు సమస్యను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిఎంకె అడుతున్నట్లు చెబుతున్నారు. అప్పుడు ఏం చేయాలనేది ప్రధానికి పాలుపోని సమస్యగా మారే అవకాశం ఉంది. కొత్త ముఖాలకు, యువకులకు ఈ సారి మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు లభించవచ్చునని అంటున్నారు.
సాధారణ ఎన్నికలకు కేవలం 18 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ కావచ్చు. అందువల్ల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications