వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు అంతరంగం: లోకేష్ లీడర్, మరి జూ. ఎన్టీఆర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తన కుమారుడు నారా లోకేష్‌ను తాను లీడర్‌గా తయారు చేశానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్న సందర్బంగా ఆయన వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో తన అంతరంగాన్ని విప్పారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అని అడిగితే ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అది లోకేశ్ ఇష్టమని, తాను లోకేష్‌ను లీడర్‌గా తయారు చేశానని, ఇప్పుడు హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటున్నాడని ఆయన వివరించారు.

రాజకీయాల్లోకి రావాలని తాను ఒత్తిడి తేవడం లేదని, దేశ రాజకీయాలకు ఒక దశను దిశను ఇచ్చినవాడిని, తనకు లోకేష్ సలహాలు ఇవ్వాలని, కుటుంబ పెద్దగా పార్టీలో అందరి సలహాలు వింటున్నానని, అంతిమంగా తానే నిర్ణయం తీసుకుంటున్నానని ఆయన వివరించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా - ఇవన్నీ వాస్తవాలు కాదని, కటుంబంలో అదరినీ గౌరవిస్తామని, వ్యక్తిగత సమస్యలు వేరు, పార్టీ సమస్యలు వేరని ఆయన అన్నారు. రెండింటికీ స్పష్టమైన తేడా ఉందని, కుటుంబం కన్నా పార్టీ, రాష్ట్రమే తనకు ముఖ్యమని ఆయన అన్నారు.

బాలకృష్ణ గురించి అడిగినప్పుడు - "మాది పెద్ద కుటుంబం. అందరినీ గౌరవిస్తూ పార్టీకి అందరి సేవలు తీసుకోవడం నా బాధ్యత. బాలకృష్ణకు పార్టీపై ప్రేమ ఉంది. నాకు సినిమా రంగం ఎంత కొత్తో బాలకృష్ణకు రాజకీయ రంగం అంతే. ఆయన సేవలు పార్టీకి ఎలా వినియోగించుకోవాలో చర్చించి నిర్ణయించుకొంటాం" అని ఆయన అన్నారు.

తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తెలంగాణకు మద్దతు ఇస్తారా అని అడిగితే అప్పుడు తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బదులిచ్చారు. విశ్వసనీయతపై ప్రశ్నించినప్పుడు ఆయన వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఎంత అవసరమైతే అంత మారుతానని, అయితే కోట్లు కూడబెట్టి జైలుకు వెళ్లి కూర్చోవడం తన వల్ల కాదని ఆయన అన్నారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu revealed his opinion on different issues in his interviews given to news papers and TV channels. He said that he made his son Nara Lokesh as a leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X