వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబుల్ లక్: బాబుకు దగ్గరవుతున్న జూ.ఎన్టీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Jr Ntr
నందమూరి, నారా కుటుంబాలు మళ్లీ ఏకమవుతున్నాయి. పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో తెలుగుదేశం పార్టీకి ఇది సాదాసీద ఊరట కాదని చెప్పవచ్చు. అన్న గారి కుటుంబం కలుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. నిన్నటికి నిన్న రాజ్యసభ సభ్యుడు, బావమరిది హరికృష్ణ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో అన్ని విభేదాలు పక్కన పెట్టి యాత్ర ప్రారంభంలో మొత్తం తానై వ్యవహరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా దూరమే అని అందరూ భావించారు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నారు. చంద్రబాబు చేపట్టిన 117 రోజుల వస్తున్నా మీకోసం పాదయాత్రలో జూనియర్ పాల్గొననున్నారు. బాబు యాత్ర అనంతపురం, కర్నూలు జిల్లాల తర్వాత మహబూబ్‌నగర్‌లో ఉంటుంది. ఇక్కడకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ బాబు యాత్రలో పాల్గొని పార్టీకి అండగా ఉన్నానని, పార్టీతోనే ఉన్నానని కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపనున్నారు. ఇప్పటికే నారా లోకేష్ కారణంగా పార్టీలో నూతనోత్తేజం కనిపిస్తోంది.

అంతకుముందే యాత్ర కర్నూలుకు చేరుకున్న తర్వాత హీరో నందమూరి బాలకృష్ణ కూడా బాబుతో కదం కలపనున్నారు. బాబు యాత్ర కార్యకార్తలలో విశ్వాసం నింపేందుకు పనికొస్తుందని అందరూ భావించారు. అయితే ఇదే యాత్ర ఇరు కుటుంబాలని కలిపి పార్టీకి డబుల్ లబ్ధిని చేకూరుస్తోంది. ఈ కుటుంబాల కలయిక ప్రస్తుత తరుణంలో పార్టీకి ఎంతో అవసరం. నిన్నటి వరకు బాబు అంటేనే ఆగ్రహం వ్యక్తం చేసిన హరికృష్ణ యాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందే హిందూపురానికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలిరోజు బాబుతో కాసేపు నడిచారు.

అంతేకాదు బాబుకు ఎప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. బాలకృష్ణ మొదటి నుండి అధినేతకు మద్దతుగా నిలుస్తున్నారు. లోకేష్ వ్యవహారంతో జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తికి లోనైనప్పటికీ ఇప్పుడు పాదయాత్రలో పాల్గొని తెలుగుదేశానికి, బాబుకు అండగా నిలువనున్నారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి జూనియర్ మెరిస్తే ఇక టిడిపి కార్యకర్తలకు పండగే అని చెప్పవచ్చు.

English summary
Heros Nandamuri Balakrishna and Junior NTR will participate in Telugudesam Party chief Nara Chandrababu Naidu's Vastunna Meekosam padayatra in Kurnool and Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X