అక్కడ మొఘల్ గోల్డ్, ఇక్కడ నిజాం వెండి నాణేలు

ఒక్కో బంగారు నాణెం 3.2, 3.3 గ్రాముల బరువున్నాయి. మొత్తం 214 నాణేలతో పాటు 110 గుండ్లు, 6 పతకాలు, 2 బుగుడులు, ఒక వెండి నాణెం ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా పాత పంబాపూర్ శివారులో సమాధి కోసం తవ్వుతుండగా నిజాం కాలం నాటి 244 వెండి నాణేలు బయటపడ్డాయి. గత ఫిబ్రవరి 25న అక్కడ సమాధి నిర్మాణం కోసం పాత పునాదిని తవ్వుతుండగా నిజాం కాలం నాటి వెండి నాణాలు బయటపడ్డాయి. వాటిని పంబాపూర్ గ్రామానికి చెందిన వారు ఇంటికి తీసుకెళ్లారు. విషయం ఈ నెల ఇరవయ్యో తేదిన తహసీల్దార్‌కు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారివద్ద నుంచి 244 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.1,16,175 మేరకు ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications