ఆ మిస్టరీ మహిళ బెంగళూర్ డ్యాన్సర్
లండన్/బెంగళూర్: లండన్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్న మిస్టరీ మహిళను గుర్తించారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల మార్చ్ పాస్ట్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో పాటుగా కలిసి నడిచిన ఒక అపరిచిత మహిళ వ్యవహారం కలకలం సృష్టించింది. భారత పతాకాన్ని చేతబట్టి ముందుండి నడిచిన బాక్సర్ సుశీల్ కుమార్ పక్కన ఎరుపురంగు టీ షర్ట్, నీలం రంగు ప్యాంటుతో ప్రత్యక్షమైన ఆ మహిళ.. ట్రాక్ మొత్తం ఆటగాళ్లతోనే కలిసి నడిచింది.

ఆ మహిళను బెంగళూర్‌కు చెందిన డ్యాన్సర్ మధుర నాగేంద్రగా గుర్తించారు. డానీ బోయల్ ప్రారంభోత్సవ వేడుకలకు తమ కూతురిని ఎంపిక చేసినట్లు మధుర తండ్రి కెఎల్ నాగేంద్ర చెప్పారు. ఆయన బెంగళూర్‌లో చర్మ ఎగుమతి సంస్థను నడుపుతారు. ఆమె వల్ల భద్రతకు సంబంధించిన సమస్య తలెత్తలేదని లండన్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటి చైర్మన్ సెబాస్టియన్ కోయె చెప్పారు. ఆమె కాస్ట్ మెంబర్ కారని, అత్యుత్సాహంతో అలా వచ్చేసిందని అన్నారు.
తన కూతురు చొరబాటుదారు కాదని, భద్రతా ఉల్లంఘన ఏదీ జరగలేదని నాగేంద్ర అన్నారు. భారతీయురాలు అయినందున నిర్వాహక కమిటీ తన కూతురిని మైదానంలోకి భారత ఆటగాళ్లను తీసుకుని పోవడానికి ఎంపిక చేసి ఉంటుందని ఆయన అన్నారు. షోను చూడడానికి ఆమెకు పాస్ ఉందని చెప్పారు.
ఈ సంఘటన భారత ఆటగాళ్ల మనోభావాలు దెబ్బ తిని ఉండవచ్చునని, దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, తాను శనివారంనాడు లండన్‌ను నుంచి తిరిగి వచ్చానని, మరో రెండు రోజుల్లో తన కూతురు బెంగళూర్ వస్తుందని ఆయన చెప్ాపరు.
నాగేంద్ర, జాహ్నవి దంపతుల ముగ్గురు కూతుళ్లలో మధుర రెండో కూతురు. వారు బెంగళూర్‌లోని బనశంకరి ప్రాంతంలో నివసిస్తున్నారు. మధుర క్రిస్ట్ విశ్వవిద్యాలయం నుంచి 2009లో కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications