భూకబ్జా వివాదంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు?

ఎర్త్ మూవర్‌తో దాదాపు 30 మంది తన భూమిలోకి చొరబడి కూల్చివేత కార్యక్రమం చేపట్టారని మొయినుద్దీన్ ఆరోపించాడు. తాము కేసు నమోదు చేశామని ఎసిపి చెప్పారు. నిందితులను గుర్తించాల్సి ఉందని చెప్పారు. అయితే, భూమిలోని భవనాల కూల్చివేతలో హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ప్రమేయం ఉందంటూ కొన్ని తెలుగు టీవి చానెళ్లు ఆరోపిస్తూ సోమవారం వార్తాకథనాలను ప్రసారం చేశాయి. తన మిత్రుడికి సాయపడుతున్నానని కార్తిక్ రెడ్డి చెప్పినట్లు మొయినుద్దీన్ టీవీ చానెళ్లతో చెప్పాడు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని సబితా ఇంద్రా రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావును ఆదేశించారు. అయితే, మొయినుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదులో కార్తిక్ రెడ్డి పేరు గానీ, ఆయన అనుచరుల పేర్లు గానీ లేవని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications