వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగులు లేని జగన్ కంపెనీలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సండూరు పవర్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) గోపాలకృష్ణన్ మురళీ... సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలను తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. జగన్‌కు చెందిన కంపెనీలు పలు బోగస్‌వే అని ఆయన చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. పత్రికల కథనం మేరకు గోపాలకృష్ణన్ మురళి జగన్ కంపెనీలకు చెందిన పలు విషయాలను ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు.

ఏయే కంపెనీలు ఏయే ఆస్తులు, నిర్మాణాలకు నిధులను వెచ్చించాయో ఆయన వెల్లడించారు. జగన్ మన రాష్ట్రంలోనే కాకుండా కర్నాటకలోనూ భారీ ఎత్తువ ఆస్తులు సేకరించారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు తదితర అభివృద్ధి చెందుతున్న, ఖరీదైన ప్రాంతాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. స్థలాలు, భూములు, నిర్మాణాల నిమిత్తం నిధులను జగన్ గ్రూపులోకి పలు కంపెనీలు తరలించాయి. జగన్ గ్రూపుకు చెందిన 15 కంపెనీల్లో ఒక్క సండూరు పవర్ కంపెనీలో మాత్రమే 15 మంది ఉద్యోగులు ఉన్నారు.

క్లాసిక్ రియాల్టీలో ఇద్దరు ఉండగా, మిగిలిన పదమూడు కంపెనీలలో ఒక్క ఉద్యోగి కూడా లేరని తెలిపారు. 2006లో తాను జిఎంగా చేరానని, సండూరుతో పాటు దాని అనుబంధ కంపెనీలు, గ్రూపునకు చెందిన మరో 14 కంపెనీల ఖాతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను విజయ సాయి రెడ్డి సూచనల మేరకు పని చేస్తానని చెప్పారు. ఎక్కువ కంపెనీలకు వైయస్ భారతీ రెడ్డి, రమేష్ బాబులు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు.

జగన్ కూడా 2004-2009 మధ్య వివిధ సందర్భాలలో డైరెక్టర్లుగా కొనసాగారని చెప్పారు. కంపెనీల వ్యవహారాలను డైరెక్టర్లు భారతి, జగన్‌లే నిర్వహించే వారని చెప్పారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భూమి కొనుగోలుకు భగవత్ సన్నిధి ఎస్టేట్స్ చెల్లించిందని తెలిపారు. కర్నాటకలో భారీ ఎత్తున సేకరించారని గోపాలకృష్ణన్ మురళి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు చెప్పారని తెలుస్తోంది.

English summary

 The CBI told a special court hearing cases against Jagan Mohan Reddy that the MD of Sandur Power had stated that all other companies floated by the YSRC president were ‘fictitious.’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X