హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారా చౌదరికి మాజీ సిఎం భార్య సపోర్ట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
వ్యభిచార రాకెట్ సూత్రధారిగా అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరికి మాజీ ముఖ్యమంత్రి భార్య మద్దతు ఉండేదని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్లదినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. తారా చౌదిర సమస్యల్లో చిక్కుకున్న ప్రతిసారి మాజీ సిఎం భార్య ఆమెను ఆదుకుంటూ వచ్చారని ఆ పత్రిక రాసింది. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ఆ పత్రిక రాసింది. తారా చౌదరిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు నాలుగు రోజుల పాట తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు.

తారా చౌదరికి గతంలో ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు రెడ్ కార్పెట్ పరిచేవారని తెలుస్తోంది. ఆమె తరుచుగా తిరుమలను సందర్శించేదట. తిరుమలలో పోలీసులు ఆమెకు విఐపి దర్శనం ఏర్పాటు చేసేవారని అంటారు. ఆమెకు విపరీతమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసేవారని అంటున్నారు. ఆమె సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ప్రముఖులు ఆమెకు మద్దతుగా వచ్చేవారని పోలీసు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

తారా చౌదరి తరుచుగా గుంటూరు సందర్శించేదని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ఆమెకు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. పలువురు రాజకీయ నాయకులతో కూడా ఆమెకు సంబంధాలున్నట్లు తేలింది. గుంటూరుకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడితో ఆమె తరుచుగా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేదని అంటున్నారు. తారా చౌదరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సిడిల వల్ల ఆ విషయం బయటపడినట్లు ఆంగ్ల పత్రిక రాసింది.

చిత్రసీమలో నటన ద్వారా అంతగా రాణించని తారా చౌదరి తన క్లయింట్లతో మాట్లాడడంలో మాత్రం ఆరితేరినట్లు చెబుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో సీడీలను పరిశీలిస్తే - ఆమె తన క్లయింట్లతో ఎంత మత్తు గొలిపే విధంగా మాట్లాడిందో తెలిసిపోతుందని అంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆమె క్లయింట్ల దగ్గరికి వెళ్లడం మానేసి వారినే తన వద్దకు రప్పించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారని వార్తాకథనం సారాంశం.

క్లయింట్లతో మాట్లాడిన సంభాషణలను, వారి రాసలీలల వ్యవహారాలను ఆమె స్పై కెమెరా ద్వారా రికార్డు చేయించినట్లు చెబుతున్నారు. సిడీలతో పాటు పోలీసులు తారా చౌదరి నివాసం నుంచి కొన్ని ప్రామిసరీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అవి తారా చౌదరి పలువురి నుంచి అప్పులు తీసుకుని రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు.

తారా చౌదరి క్లయింట్ల నుంచే కాకుండా బయటివారి నుంచి కూడా అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్షలాది రూపాయలు ఆమె అప్పులు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. సోదాల్లో పోలీసులు 90కి పైగా సీడిలను స్వాధీన చేసుకున్నారు. వాటిని పోలీసులు పూర్తిగా పరిశీలించి, విశ్లేషించాల్సి ఉంది. బెంగళూర్‌లో ఆమె ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు.

పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

పోలీసుల ద్వారా విఐపి ట్రీట్‌మెంట్ స్వీకరించిన తారా చౌదరి ఇప్పుడు జాతకం తిరగబడి వారి చేతికే చిక్కింది. ఆమె చాతుర్యాన్ని క్లయింట్లపైనే కాకుండా పోలీసుల మీద కూడా ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. విచారణ సందర్భంగా పోలీసులు తనను లైంగిక వేధించారని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం కోర్టులో చెప్పింది. కోర్టులో ఆమె ఏడ్చేసింది. ఎసిపి శంకర్ రెడ్డి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది.

స్లీజీ సీడిలను చూసి పోలీసులు క్లయింట్లకు ఫోన్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, డీల్స్ కుదుర్చుకుంటున్నారని ఆమె ఆరోపించింది. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎం సుదర్శన్ కూడా తనను పోలీసు కస్టడీలో వేధించాడని ఆమె ఆరోపించింది. ఫిర్యాదులను రాతపూర్వకంగా ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు.

తారా చౌదరి చేసిన ఆరోపణలను శంకర్ రెడ్డి ఖండించారు. చాలా కాలంగా తారా చౌదరి తనపై కక్ష పెంచుకుందని, తాను తన విధి మాత్రమే నిర్వహించానని ఆయన అంటున్నారు. పోలీసులు తారా చౌదరి అనుచరుడు హనీఫ్ కోసం గాలిస్తున్నారు. వీడియో, ఆడియో రికార్డింగులకు అతను సాంకేతిక సహకారం అందించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని నవోదయ కాలనీలో గల ఆమె నివాసంలో సీక్రెట్ కెమెరాలను, మైక్రోఫోన్‌లను అతనే అమర్చాడని భావిస్తున్నారు. వీడియోల్లో రికార్డు చేసిన తర్వాత వాటిని ల్యాప్‌టాప్‌ల్లోకి బదిలీ చేసేవాడని, సిడీల్లోకి ఎక్కించేవాడని అంటున్నారు.

ముంబైకి చెందిన మన్ను సెక్యురిటీ

ముంబైకి చెందిన మన్నుతో పాటు హనీఫ్ తారా చౌదరి వ్యక్తిగత భద్రతను చూసేవారని తెలుస్తోంది. తారా ఆదేశాలను ధిక్కరించినవారిని వారిద్దరు బెదిరించినట్లు కూడా పోలీసులు భావిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. హనీఫ్ కోసమే కాకుండా పోలీసులు మన్ను కోసం కూడా గాలిస్తున్నారు. తారా చౌదరి క్లయింట్లలో రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు చెబుతున్నారు.

తమ కస్టడీ ముగిసిపోవడంతో పోలీసులు ఆమెను బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. ఆమెను ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు పంపించారు.

English summary
According to news reports - starlet Tara Chowdary arrested by police, has enjoyed the support of former chief minister's wife. Tara was produced before the Third Additional Chief Metropolitan Magistrate court after the completion of her four-day police custody. She was remanded in judicial custody till April 13. Later, she was sent back to the Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X