వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీకి డుమ్మా: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల వరకు శాసనసభ సమావేశాలను బహిష్కరించాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీ రామారావు అనుసరించిన విధానాన్నే అనుసరించాలని అనుకుంటున్టన్లు తెలుస్తోంది.

శాసనసభ సమావేశాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయో జనం కలగడం లేదని, ప్రజలు కూడా దీనిపెై తీవ్ర అసంతృప్తితో ఉన్నందున, ప్రభుత్వ నియంతృత్వ వెైఖరికి నిరసనగా, 2014 ఎన్నికల ముందువరకూ జరిగే శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీనిపెై పలువురు సీనియర్లు కూడా సానుకూలంగానే మాట్లాడుతున్నారు.

శాసనసభా సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం వల్ల కాంగ్రెస్‌, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతాయని, వాటిని సులభంగా ఎదుర్కోవచ్చునని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సి వస్తుందని పారిపోయిందన్న విమర్శలు కచ్చితంగా వస్తాయని, అయితే ప్రజాసమస్యలపై చర్చ జరగనప్పుడు, ఇక సమావేశాలకు హాజరయి ఏమి ప్రయోజనమని తాము ఎదురుదాడి చేయవచ్చునని చెబుతున్నారు.

గతంలో ఎన్టీఆర్‌ మళ్లీ తాను అధికారంలోకి వచ్చేంత వరకూ అసెంబ్లీ ముఖం చూడనని శపథం చేసినప్పుడూ ఇలాంటి విమర్శలే వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అయితే తాము ప్రజాసమస్యలు చర్చకు రానందుకు నిరసనగా ప్రజాక్షేత్రంలోనే వాటిని తేల్చుకుంటామని స్పష్టం చేస్తాము కాబట్టి, ప్రజలు తమ నిర్ణయాన్ని స్వాగతిస్తారని నేతలు భావిస్తున్నారు.కాగా, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం అటు పార్టీ విస్తృతికీ పనికివస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు పాదయాత్రతో ప్రజలు తమ పార్టీ వెైపు సానుభూతి, సానుకూలంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు బాబుకు మద్దతు పలుకుతున్నారని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీకి బలమైన క్యాడర్‌ ఉన్న తెలంగాణలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభించడంపెై నేతలు, క్యాడర్‌ ఊపు మీద కనిపిస్తున్నారని పార్టీ అంచనాలు వేస్తోంది.

రానున్న 2014 ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆ మేరకు ఇప్పటినుంచే తన పునాదులను పటిష్ఠం చేసుకునే పనిలో ఉంది. సంస్థాగత వ్యవహారాలపెై దృష్టి సారిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ మేరకు తన పాద యాత్ర ద్వారా కార్యకర్తలలో చెైతన్యం తీసుకువస్తూ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఓ వెైపు పాదయాత్ర చేస్తూనే మరోవెైపు పార్టీ జిల్లా కమిటీలు, నియామకాలపెై దృష్టి సారిస్తున్నారు.

English summary
It is said that Telugudesam party is in a bid to boycott assembly sessions till the 2014 election. Earlier NT Ramarao followed the same strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X