సీమాంధ్రలో జగన్‌తో తెలంగాణ మంత్రులూ ఢీ!

DK Aruna-Sridhar Babu
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెసు పార్టీ పెద్దలు సీమాంధ్ర నేతలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలను రంగంలోకి దింపారు. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులకు సీమాంధ్రలో త్వరలో జరగనున్న నియోజకవర్గాలలో ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.

రెండు మూడు నెలల్లో జరగనున్న ఉప ఎన్నికలను అధిష్టానం సీరియస్‌గా పరిగణించిన నేపథ్యంలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా వీలైనంత ఎక్కువ మంది నేతలను రంగంలోకి దింపింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలకూ సీమాంధ్ర ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.

తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబుకి తిరుపతి, డికె అరుణకి రైల్వే కోడూరు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాచర్ల, సబితా ఇంద్రా రెడ్డికి రాయచోటి నియోజకవర్గాల కమిటీల్లో సభ్యులుగా నియమించారు. సమన్వయ కమిటీలో సభ్యులైనా వీరికే అధిక బాధ్యతలు ఉంటాయి.

పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణని రాయదుర్గం, శాసనమండలి సభ్యుడు ఫారుఖ్ హుస్సేన్‌కు రాజంపేట బాధ్యతలను అప్పగించారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు మంత్రి దానం నాగేందర్‌ను సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమించారు. నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్యను మాచర్ల నియోజకవర్గం కమిటీలో వేశారు.

అయితే రాష్ట్రంలో ప్రత్యేక, సమైక్య రాష్ట్రవాదాలు బలీయంగా ఉన్న నేపథ్యంలో ఒక ప్రాంతంలో ఎన్నికల బాధ్యతలను మరో ప్రాంత నేతలకు అప్పగిస్తూ నిర్ణయించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+