వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా వార్: బాబును వైయస్ అనుసరించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-YS Rajasekhar Reddy
పత్రికలకు ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనలను జారీ చేసే విషయంలో ఈనాడు రామోజీ రావుకు, సాక్షి దినపత్రిక వైయస జగన్‌కు మధ్య నెలకొన్న మీడియా సమరం కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. సాక్షి దినపత్రికకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అత్యధిక వాణిజ్య ప్రకటనలను జారీ చేశారనే వార్తకాథనానికి కౌంటర్‌గా వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక రాసిన వార్తాకథనం కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం ఎవరిదైతే వారికి సంబంధించిన పత్రికలకు మేలు చేయడం జరుగుతోందే అనేది ఆ కొత్త విషయం. మీడియాకు సహకరించాలనే ఉద్దేశంతో జరుగుతోందా, మీడియాను కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతోందా అనేవి ఇక్కడ ప్రశ్నలు కావు.

తమ వారికి చెందిన పత్రికలకు అత్యధిక వాణిజ్య ప్రకటనలను జారీ చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో అనుసరించిన విధానాన్నే వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో అనుసరించారనే విషయాన్ని సాక్షి దినపత్రిక గురువారం ప్రచురించిన ఓ వార్తాకథనం చెప్పకనే చెబుతోంది. పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి అని, అందులో ఆర్ఎన్ఐ సర్టిఫికెట్ కలిగి ఉండడం, ఆరు నెలలుగా ప్రచురితమవుతుండడం వంటిని కొత్త పత్రికలకు సాధ్యం కాదని అంటూ అందుకని కొత్త పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి వీటిని మినహాయిండం అనేది ఎప్పటి నుంచో ఉందని సాక్షి దినపత్రిక వార్తాకథనం చెబుతోంది. వైయస్ హయాంలో తమకు ఎక్కువ ప్రకటనలు ఇవ్వడాన్ని సాక్షి అలా సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఏయే పత్రికలకు మినహాయింపులో ఇచ్చారో వివరాలు ఇచ్చింది.

నిబంధనలను సడలిస్తూ వార్త, ఆంధ్రజ్యోతి, ఎతెమాద్, సూర్య, సాక్షి పత్రికలకు మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వాలు ఏ తేదీన జీవోలు జారీ చేసిందీ సాక్షి దినపత్రిక తెలిపింది. ఈ పత్రికల్లో వార్త, ఆంధ్రజ్యోతి దినపత్రికల కోసం చంద్రబాబు నిబంధనలను సడలించారని తెలిపింది. ఆంధ్రజ్యోతికి ఎందుకు నిబంధనలు సడలించారు, చంద్రబాబును ఎందుకు పిలువకూడదని సాక్షి ప్రశ్నించింది. మిగిలినవారికి మినహాయింపులు ఇచ్చినప్పుడు ఈనాడు ఎందుకు ప్రశ్నించదు, సాక్షికి ఇస్తేనే ఎందుకు విషం చిమ్ముతోందని అడిగింది. ఈ రెండు ప్రశ్నలతో సాక్షి తన వార్తాకథనాన్ని ముగించింది.

English summary
YS Jagan's Sakshi daily report put forwards a new angle regarding government's ads to news papers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X