వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కువైట్‌లో బ్రదర్ అనిల్‌కు ఏమైంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Anil Kumar
హైదరాబాద్: కువైట్‌లో బ్రదర్ అనిల్ కుమార్‌కు ఏమైందనే విషయంపై మీడియా సంస్థలు కొట్టుకుంటున్నాయి. అనిల్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు తొలుత హడావిడిగా వార్తలను ప్రసారం చేసిన టీవీ చానెళ్లు కొన్ని ఆ తర్వాత మార్చేశాయి. ఆయన మతప్రచార సభను అడ్డుకున్నట్లు మాత్రం వార్తలను ప్రసారం చేశాయి. దినపత్రికలు కూడా ఆ వార్తను ప్రచురించాయి. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పత్రిక సాక్షి కథనం మాత్రం కాస్తా భిన్నంగా ఉంది.

కువైట్ మాజీ ఎంపి దొవేతో బ్రదర్ అనిల్ భే్టీ అయిన ఫొటోను ప్రచురించి, బ్రదర్ అనిల్ కుమార్‌ను కువైట్‌లో అరెస్టు చేశారంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్రాధ్యక్షుడు హెచ్ఎ రెహ్మాన్ చెప్పినట్లు రాసింది.

చర్చి సమావేశ కార్యక్రమాన్ని బహిరంగ స్థలంలో నిర్వహించడం పట్ల కొందరు అభ్యంతరం చెప్పారని, దోవే సహకారంతో ఇండోర్ స్టేడియంలో సమావేశాన్ని నిర్వహించడానికి యునైటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ అనుమతి ఇచ్చిందని సాక్షి దినపత్రిక రాసింది. అనిల్ కుమార్‌తో పాటు ఆయన భార్య షర్మిళ కూడా కువైట్‌లో ఉన్నారు. షర్మిళ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురనే విషయం తెలిసిందే.

అయితే, ఇతర మీడియా కథనాలు ఇలా ఉన్నాయి - కువైట్‌లో కూడా మామ వైఎస్ ప్రతిష్ఠను అడ్డుపెట్టుకొని అరెస్టు అవకాశాన్ని తృటిలో తప్పించుకొని బయటపడ్డారు. వారి వెంట ప్రయాణించేందుకు తొలుత ఆసక్తి చూపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి రాజకీయ కారణాలతో చివరి నిమిషంలో ఆగిపోయారు.

కువైట్‌లోని తెలుగు క్రైస్తవ మందిరాలతో సంబంధాలున్న బ్రదర్ అనిల్‌కుమార్ ప్రోత్సాహం మేరకు కడప జిల్లాకు చెందిన జోసఫ్ రెడ్డి చర్చిని నిర్వహిస్తున్నారు. దాని ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు అనిల్ ను ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమం కోసం భార్య షర్మిల, పిల్లలు, బంధువులతో కలిసి బ్రదల్ అనిల్ కువైట్‌కు వచ్చారు. గతంలోకూడా అనేక సార్లు బ్రదల్ అనిల్ కువైట్ సందర్శించి, కైస్త్రవ మత సభల్లో పాల్గొన్నారు.

కానీ, ఈసారి 'రాజకీయ' కోణంలో భారీ సభకు పథక రచన చేశారు. కువైట్‌లోని రాయలసీమ వాసులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తుగడే పన్నారు. వైసీపీకి పెరిగిన సీట్ల బలం, వైయస్ ప్రతిష్ట కలిసి సభ బ్రహ్మాండంగా జరిగిపోతుందని అంచనాలు వేశారు. కానీ, ఈ విషయాలేవీ కువైట్ పోలీసులు తెలియకుండా చాప కింద ఏర్పాట్లు మొదలుపెట్టారు.

క్రైస్తవ సభ విషయం చెప్పకుండా.. ఎన్ఆర్ఐల సాంస్కృతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి కువైట్‌లోని ఒక పార్కును తీసుకున్నారు. తీరా చూస్తే ఆ ఛాయలేవీ కనిపించకపోగా పార్కు వద్ద భారీ హంగామా నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమం ముసుగులో క్రైస్తవ మత సభను నిర్వహిస్తున్నారన్న విషయం బయటకు పొక్కింది. దీనిపై కువైట్ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఎంపీ డాక్టర్ వలీద్ అల్ తబ్‌తబై బ్రదర్ అనిల్‌కుమార్ బృందంపై తీవ్రంగా మండిపడ్డారు.

English summary
A public prayer meeting attended by evangelist Brother Anil Kumar, son-in-law of late chief minister Y.S. Rajasekhar Reddy, was cancelled by the police in Kuwait, on Thursday. The police also questioned one of the organizers, Brother Joseph Reddy, who is working with Kuwait’s interior ministry. The police action followed objections by Kuwaiti MP Waleed Al-Tabtabaei against renting out the park at Jleeb, a public area, for the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X