• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ భూపందేరాలు: ఖజానాకు లక్ష కోట్ల గండి

By Pratap
|

YS Rajasekhar Reddy
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఇష్టారాజ్యంగా కట్టబెట్టిన భూముల వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్ల రూపాయల గండి పడినట్లు కాగ్ తప్పు పట్టింది. వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి వైయస్ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు కాగ్ తెలిపింది. ఆలా 88,500 ఎకరాల భూమిని వైయస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కట్టబెట్టినట్లు ఆరోపించింది. 2006-11 మధ్య జరిగిన భూ పందేరాలపై కాగ్ ప్రత్యేక పరిశీలన జరిపింది. కాగ్ నివేదికలను గురువారం ప్రభుత్వం శానససభలో ప్రవేశపెట్టింది. భూ బదలాయింపులు, కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను కాపాడలేదని, హేతుబద్ధత మరిచి ఇష్టారాజ్యంగా, కారుచౌకగా భూములు అప్పగించారని, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చారని కాగ్ తప్పు పట్టింది. 2006-11 మధ్య భూ కేటాయింపులపైనే కాగ్ పరిశీలన జరిపింది. ఇందులో వైఎస్ హయాం 2009 సెప్టెంబర్‌తో ముగిసినప్పటికీ, కాగ్ ప్రస్తావించిన కేటాయింపుల్లో 99 శాతం వైఎస్ జరిపినవే కావడం విశేషం

మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా చిల్లర పైసలకే విలువైన భూములు కట్టబెట్టారని తెలిపింది. "జిల్లా కలెక్టర్లు/సాధికార సంఘం సిఫారసు చేసిన మార్కెట్ విలువకూ, ప్రభుత్వ భూములను బదలాయించిన రేట్లకూ భారీ వ్యత్యాసం ఉంది. దీనివల్ల వివిధ సంస్థలు, వ్యక్తులకు ఏకంగా రూ.1784 కోట్ల అయాచిత లబ్ధి చేకూరింది'' అని కాగ్ వివరించింది. "2006-11 సంవత్సరాల మధ్య 1027 మందికి 88,492 ఎకరాలు కట్టబెట్టారు. మచ్చుకు 11 జిల్లాలో 459 మందికి జరిగిన కేటాయింపులను పరిశీలించాం. వాణిజ్య అవసరాలకు భూకేటాయింపులు జరిగిన తీరులో ఒక పద్ధతి లేదు. పారదర్శకత లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడేలా లేదు'' అని కాగ్ చెప్పింది.

భూములను ఏపీఐఐసీ బదలాయించిన తీరును కాగ్ తప్పు పట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారవృద్ధికి యథాశక్తి సహకరించిందని విమర్శించింది. రాష్ట్రంలో పారిశ్రామికీరణకు ఏపీఐఐసీ ఏమాత్రం తోడ్పడలేదని, ప్రభుత్వ ప్రయోజనాలనూ కాపాడలేదని ఏపీఐఐసీని కాగ్ తప్పు పట్టింది. ఏపీఐఐసీ వ్యవహారం వల్ల రియల్టర్ల వ్యాపారం బాగు పడిందని, సమాచార-సాంకేతిక మౌలిక వసతులను అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదని స్పష్టం చేసింది. కేటాయించిన భూములు అమ్ముకుంటున్నా, తాకట్టు పెట్టుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని తెలిపింది.

వేల ఉద్యోగాలు వస్తాయని నమ్మబలుకుతూ వందల ఎకరాలను 'సెజ్'లకు కట్టబెట్టిన ప్రభుత్వ ప్రకటనల్లోని డొల్లతనాన్ని కాగ్ అంకెలతో సహా బయటపెట్టింది. మచ్చుకు 11 సెజ్‌లను మాత్రం పరిశీలించింది. 5,92,507 ఉద్యోగాలు వస్తాయంటూ ప్రభుత్వం 17,911 ఎకరాలను పంచి పెట్టిందని, కానీ వీటిద్వారా కేవలం 25,582 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని కాగ్ పట్టిక రూపంలో బయటపెట్టింది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తికానివైనంపై కాగ్ మండిపడింది. కేటాయింపులు జరిగినా వృథాగా ఉన్న భూముల లెక్క తీసింది. కాగ్ నివేదిక సిబిఐ దర్యాప్తునకు పనికి వచ్చే విధంగా ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Providing fodder to the CBI probing the various land allotments in the state during the YSR government, the Comptroller and Auditor General (CAG) has concluded that the Andhra Pradesh government doled out thousands of acres of government land to private individuals on an ad hoc and arbitrary manner without safeguarding the interests of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more