వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ బరిలో వైయస్ జగన్ పార్టీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి మరో ప్రమాదం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల లోగా జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో షాక్ ఇవ్వడానికి వైయస్ జగన్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. రాజ్యసభ బరిలో తమ అభ్యర్థిని నిలపాలని ఆయన అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు పొందడానికి మాత్రమే వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై వేటు వేయడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెసును విమర్శిస్తున్నారు. కానీ, వైయస్ జగన్ ఆలోచన అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పెట్టి మరోసారి సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌లో రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఇందులో నాలుగు స్థానాలు కాంగ్రెసు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఆ సమయంలో కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో బేరసారాలు ఆడవచ్చునని అంటున్నారు. దాన్ని నివారించడానికి జగన్ తన అభ్యర్థినే పోటీకి పెట్టాలని అనుకుంటున్నారు. అభ్యర్థిని పోటీకి దించడానికి పది మంది శాసనసభ్యుల సంతకాలు సరిపోతాయి. సీటు గెలవాలంటే మాత్రం 39 నుంచి 42 మంది శాసనసభ్యుల మద్దతు అవసరమని తెలుస్తోంది. గెలిచే అవకాశాలు లేనప్పటికీ కాంగ్రెసు వైపు వెళ్లకుండా తన శాసనసభ్యులను కట్టడి చేయడానికి జగన్ తన అభ్యర్థిని పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిపి జగన్ వెంట 18 మంది శాసనసభ్యులున్నారు. జగన్ వ్యూహాన్ని పసిగడితే మాత్రం ఆయన వర్గం శాసనసభ్యులపై వేటు పడవచ్చునని అంటున్నారు.

English summary
It is said that YSR Congress president YS Jagan is planning to put his candidate in Rajyasabha polls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X