వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: కెవిపిపై ఆరా తీస్తున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao - YS Rajasekhar Reddy
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ బంధువు, సీనియర్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఓ కన్నేసింది! వైయస్ హయాంలో ఆయన పోషించిన పాత్ర గురించి కూపీ లాగే పనిలో పడిందట. ఆయన పాత్ర గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కెవిపి పాత్రపై అడుగుతున్నట్లుగా తెలిపింది.

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ జగన్ సహా పలువురు మంత్రులను, అధికారులను విచారించింది. కానీ, కెవిపిని మాత్రం ఇప్పటి వరకు పిలువలేదు. తెలుగుదేశం పార్టీ వంటి ప్రధాన ప్రతిపక్షం వైయస్ హయాంలో కెవిపి చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. జగన్ ఆస్తులకు సంబంధించి కెవిపి పాత్ర ఉందనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ, ఇప్పటి వరకు సిబిఐ అతనిని విచారించలేదు. కెవిపి ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా మాత్రం ఓసారి సిబిఐ ఎదుట హాజరయ్యారు.

జగన్, ఎమ్మార్ కేసులకు సంబంధించి సిబిఐ పలువురి వివరాలను పలుమార్లు సిబిఐ ప్రభుత్వాన్ని అడిగింది. తాజాగా కెవిపి గురించి అధికారికంగా సమాచారాన్ని కోరింది. కెవిపి అధికారికంగా ఎలాంటి పదవులు నిర్వహించారు? ఏ నిబంధనల కింద ఆయనను నియమించారు? ఆయన ప్రభుత్వం నుండి పొందిన ప్రయోజనాలేమిటి? ప్రభుత్వానికి కలిగిన లాభం ఉందా? తదితర పలు విషయాలు ఇవ్వాలని సిబిఐ కోరిందట.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి కీలకంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. వైయస్ వద్దకు వెళ్లాలంటే మొదట కెవిపిని కలవాల్సిందే అనేవారు. మొదటిసారి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక కెవిపిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. కేబినెట్ హోదా కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.

English summary
Central Bureau of Investigation has keen on Rajyasabha MP KVP Ramachandra Rao in YSR Congress Party chief YS Jaganmohan Reddy's DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X