• search

స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవికి భారత సినిమా రంగంలోని దిగ్గజాల జాబితాలో చోటు దక్కింది. "వందేళ్ల సినిమా: భారత సినిమాల ముఖచిత్రాన్ని మార్చేసిన మగాళ్లు" అంటూ సిఎన్ఎన్ ఐబిఎన్ రూపొందించిన జాబితాలో తెలుగు నుంచి చిరంజీవి ఒక్కడికే స్థానం దక్కింది. చిరంజీవికి ప్రముఖ మీడియా సంస్థ ఆ రకంగా మెగా కితాబు ఇచ్చేసింది. చాలా నెమ్మదిగా సినిమాల్లో ప్రారంభమైన చిరంజీవి 1980 దశకం మధ్యకు వచ్చేసరికి తిరుగులేని కథానాయకుడిగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

  భారతీయ సినిమా పరిశ్రమ తన ప్రయాణాన్ని ప్రారంభించి త్వరలో 100 సంవసత్సరాలు పూర్తి కాబొతున్న తరుణంలో ప్రముఖ మీడియా సంస్థ సిఎన్ఎన్ - ఐబియన్ మీడియా ప్రత్యేకంగా ఒక జాబితాను తయారు చేసింది. సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన నటుల జాబితాలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక్క చిరంజీవి మాత్రమే స్థానం దక్కించుకున్నారు.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  చిరంజీవి ఒకేసారి మాస్ హీరో కాలేదు. క్రమంగా ఆయన సినీ రంగంలో ఎదుగుతూ వచ్చారు. 1978లో ప్రాణంఖరీదు ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. పునాదిరాళ్లు వంటి చిన్న సినిమాల్లో కూడా ఆయన తొలినాళ్లలో నటించారు. మోసగాడు వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా వేశారు. మంచుపల్లకి వంటి హీరోయిన్ ప్రాధాన్యం గల సినిమాల్లో కూడా నటించారు.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  పున్నమినాగు చిత్రంలో చిరంజీవి అద్భుతమైన నటనను, నృత్య ప్రతిభను కనబరిచారు. దీంతోనే ఆయనలోని మాస్ నటుడు వెలికి వచ్చాడని చెప్పవచ్చు.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  ఖైదీ సినిమా చిరంజీవి దశనే మార్చేసింది. తిరుగులేని మాస్ హీరోగా ముందుకు రావడానికి ఇది పునాది వేసింది.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడు వంటి పలు సినిమాలు తన నటనతోనే కాకుండా స్టెప్పులతో, ఫైట్లతో యువతను ఉర్రూతలూగించారు.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  కేవలం మాస్‌ హీరో పాత్రలకే పరిమితం కాకుండా హీరో వర్షిప్ అంతగా కనిపించని స్వయంకృషి సినిమాలో నటించి మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  రుద్రవీణ మరో క్లాసిక్ సినిమా. చిరంజీవిని తెలుగు కుటుంబాల మధ్యకు తీసుకుని వెళ్లిన సినిమాల్లో స్వయంకృషితో పాటు రుద్రవీణ కూడా ఉంటుంది.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  ఆ తర్వాత వయసు పెరిగిన తర్వాత కూడా మాస్ హీరోగా నిలబడడానికి ఆయనకు ఇంద్ర సినిమా బాగా ఉపయోగపడింది.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  ఠాగోర్ సినిమా విశేషంగా ప్రజాభిమానాన్ని సంపాదించుకుంది. అవినీతిపై యుద్ధం ప్రకటించిన హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు.

  స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!

  రాజకీయాల్లో మాత్రం ఎన్టీ రామారావులా జయకేతనం ఎగుర వేయలేకపోయారు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పెద్దగా సీట్లు సంపాదించలేకపోయింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేసి, కేంద్ర మంత్రి పదవిని అధిష్టించారు.

  అలాగే తమిళం నుంచి శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్, రజనీకాంత్, కమల్ హసన్, కన్నడం నుంచి రాజ్‌కుమార్‌లు దక్కించుకున్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్, ముమ్మట్టి స్థానం దక్కించుకున్నారు. హిందీకి పెద్ద పీట వేశారు. హిందీ సినిమాకు సంబంధించి ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంటి నటులు స్థానం దక్కించుకున్నారు.

  మెగాస్టార్‌గా మాస్‌ను ఉర్రూతలూగించిన చిరంజీవి ఒక్కడికే సిఎన్ఎన్ ఐబియన్ జాబితాలో చోటు దక్కింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వంటివారికి అందులో చోటు దక్కలేదు. ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే చిరంజీవి వరకు మాస్ హీరోల జాబితా తెలుగు సినిమాలో ఉంది. బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమాగా చిరంజీవిని ఆ మీడియా సంస్థ అభివర్ణించింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  
 According to CNN IBN - Biggest star of Telegu cinema, Chiranjeevi started his career playing the antagonist in few films and slowly started playing the lead. By the mid 1980s, Chiranjeevi was the undisputed king of Telugu cinema.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more