జగన్‌తో సంబంధాలపై కాంగ్రెసు డైలమా..

వైయస్ జగన్‌పై కేసుల విషయంలో మాత్రం కఠినంగానే వ్యవహరించాలని మాత్రం చెప్పినట్లు సమాచారం. జగన్‌తో సంబంధాలను పెట్టుకునే ఆలోచన చేయకూడదని, జగన్‌ను రాజకీయంగా కూడా ఎదుర్కోవాలని వి. హనుమంతరావు వంటి కొంత మంది కాంగ్రెసు నాయకులు వాదిస్తుండగా, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు జగన్ పట్ల పూర్తి శుత్రవైఖరితో వ్యవహరించుకూడదని మరో వర్గం వాదిస్తోంది. జగన్‌ను రాజకీయ శత్రువుగా కూడా భావించి, కట్టడి చేసేందుకు పూనుకోవాలని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాలని సూచిస్తున్న నాయకులు ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు కావడం విశేషం.
సీమాంధ్ర నాయకులు మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పట్ల శత్రువైఖరి ప్రదర్శించకుండా, మెత్తగానే వ్యవహరించాలని వాదిస్తున్నవారిలో ఎక్కువ మంది సీమాంధ్ర నాయకులు ఉన్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్‌తో వ్యవహరించాల్సిన పద్ధతిపై డైలమాలో పడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసుతో స్నేహానికి ఒప్పించేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావు ద్వారా సబ్బం హరి మధ్యర్తిత్వం నెరిపినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అవినీతి ఆరోపణల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వైయస్ జగన్‌తో స్నేహ సంబంధాలను మెరుగు పరుచుకోవడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులకు రాజకీయ వ్యవహారాలను ముడిపెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చూస్తోంది. ఏమైనా, జగన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయం కూడా తెలంగాణతో పాటు తేలనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications