వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్: ఎలా చిక్కారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును పోలీసులు 72 గంటల్లోగా ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని పట్టుకోవడానికి 20 పోలీసు బృందాలు వేట సాగించాయి. సాధ్యమైనంత ఎక్కువ మందిని పోలీసులు ప్రశ్నించారు. ముంబై నుంచి మొదలు పెట్టి ఢిల్లీ వరకు అన్వేషణ సాగించారు.

అత్యాచారానికి పాల్పడినవారు పాత నేరస్థులు కావడం పోలీసులకు వారిని పట్టుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు తమ సెల్‌ఫోన్లను ఆఫ్ చేశారు. దాంతో ఇన్‌ఫార్మర్ వ్యవస్థపై పోలీసులు ఎక్కువగా ఆధారపడ్డారు. శక్తి మిల్స్ ప్రాంతంలోని నేరాలు చేసేవారిని లేదా మత్తుపదార్థాలు తీసుకునేవారిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఫలితం కనిపించలేదు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఐదుగురి స్కెచ్‌లు రూపొందించారు.

How police cracked Mumbai photojournalist's gang-rape case

స్కెచ్‌లు వారికి బాగా ఉపయోగపడ్డాయి. ఐదుగురిలో ఇద్దరికి నేరచరిత్ర ఉన్నట్లు బయటపడింది. చంద్ అబ్దుల్ సత్తార్ షేక్ అనే నిందితుడిపై 2011లో అగ్రిపద పోలీసు స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైంది. ఇన్‌ఫార్మర్ల ద్వారా షేక్‌ను పోలీసులు ధోభీ ఘాట్ ప్రాంతంలో అరెస్టు చేశారు. దాంతో కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. అతని ద్వారా మిగతా ముగ్గురిని పోలీసులు గుర్తించగలిగారు. ఆ తర్వాత వారి కోసం వేట ప్రారంభించారు.

ముంబ్రా, వాసి, దివా, నలసోపర, తదితర ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. బి గ్రేడ్ చిత్రం చూస్తుండగా నాగ్‌పదాలో విజయ్ జాదవ్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై టార్డియో పోలీసు స్టేషన్‌లో అతనిపై పలు కేసులున్నాయి.

ఆ ఇద్దరి ఇళ్లలోనూ, వారి మిత్రుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించి సిరాజ్ రెహ్మాన్ ఖాన్ అలియాస్ సిరాజ్‌ను ముంబ్రాలో అరెస్టు చేశారు. కీలక నిందితుడు మొహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ బంగాలీని పోలీసులు ఆదివారం ఉదయం నాయర్ ఆస్పత్రిలోని ఆరో అంతస్థులో అరెస్టు చేశారు. సాంకేతిక నిఘాతో ఐదో నిందితుడు మొహమ్మద్ సలీం అన్సారీని పోలీసులు ఢిల్లీలోని అశోక్ విహార్‌లో అరెస్టు చేశారు. చివరకు ఐదుగురిని అరెస్టు చేయడంలో పోలీసులు విజయం సాధించారు.

English summary
The manhunt for the five rapists of the Mumbai photojournalist took around 72 hours. Eighty police personnel — 20 teams — had to question as many people. And the field of the search extended from Mumbai to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X