'నగరంలో పేలుళ్లు!': సభలో ఉన్న కిరణ్‌కు తెలిసిందిలా..
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ సభలో ఉండగా తెలిసింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో గురువారం సాయంత్రం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఆరు గంటలకు ప్రారంభం కావాల్సిన ఆ కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి గంట ఆలస్యంగా వచ్చారు.
దీంతో ఏడు గంటలకు సభ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వేదిక పైన అంతలో ముఖ్యమంత్రి కిరణ్‌కు భద్రతా సిబ్బంది ఓ చీటీని అందించారు. దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలిన సమాచారం ఆ చీటీలో ఉంది. విషయం తెలియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖిన్నులయ్యారు. ఆ చీటీలో ఏముందో, అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత భద్రతా సిబ్బంది మిగిలిన వారికి ఆ విషయం చెప్పారు.
బాబు పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి అదే కార్యక్రమంలో వెంటనే స్పందించారు. పేలుళ్లకు కారణమైన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదని లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాయని, చాలా మంది చనిపోయినట్లు చెబుతున్నారని, తాను అక్కడికి వెళ్లాల్సి ఉందని, ఈ ఘటనకు ఎవరు కారణమైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని విషణ్నవదనంతో అన్నారు. ఆ తర్వాత రవీంద్ర భారతి నుండి నేరుగా దిల్‌సుఖ్ నగర్ బయలుదేరారు.

రవీంద్ర భారతిలోని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి హాజరైన కిరణ్ కుమార్ రెడ్డి.

పేలుళ్ల విషయం తెలియగానే తాను వెళ్లాల్సిన ఆవశ్యకతను సభికులకు చెబుతున్న కిరణ్.

దిల్‌సుఖ్ నగర్ చేరుకున్న ముఖ్యమంత్రి.

వెంకటాద్రి థియేటర్ ముందు పేలుడు ప్రాంతాన్ని పరిశీలిస్తూ...

థియేటర్ ముందు బస్టాండులో ముఖ్యమంత్రి.

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌లతో ముఖ్యమంత్రి.

కోణార్క్ థియేటర్ - ఆనంద్ టిఫిన్స్ ముందు.

మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!