అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ జిల్లానే: ఏపీలో 14వ జిల్లాగా అమరావతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏపీలో 14వ జిల్లాగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలో ఉన్నాయి. విభజన నేపథ్యంలో (సమైక్య ఏపీ) తెలంగాణలో పది, ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి.

రాజధాని లేకుండా ఏపీ ఉంది. దీంతో, ఏపీకి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించే యోచనలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రాజధాని పేరును అమరావతి పెట్టారు.

ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిని కొత్త జిల్లాగా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల కోసం అమరావతి రిజిస్ట్రేషన్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించింది.

Amaravati to be Andhra Pradesh’s 14th district

అయితే, తాజాగా రెవెన్యూ జిల్లాగా ఏర్పాటు చేయాలని యోచిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యాక.. ఏపీ మంత్రివర్గ ఆమోదం కోసం పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.

సిఆర్డీఏ పరిధిలో ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను కలిపి కొత్త జిల్లాగా చేయవచ్చునని అంటున్నారు. ఏపీలో ఒకటి రెండు మినహా... ఏపీలో అన్ని జిల్లాల పేర్లు ఆయా జిల్లాల రాజధానుల పేర్లతోనే ఉన్నాయి.

ఇక, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రత్యేక జిల్లా. గతంలో చంద్రబాబు ఓ మాట్లాడుతూ... రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయని... మొత్తంగా 25 జిల్లాలు కావాలని చంద్రబాబు చెప్పారు. ప్రతి లోకసభ నియోజకవర్గం ఓ జిల్లా కావాలని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని కూడా అంటున్నారు.

English summary
Andhra Pradesh state will have 14th district in the name of new capital city Amaravati. Revenue department is preparing the proposals on the formation of new revenue district of Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X