అంతా వృథా: బిజెపిని దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి నిర్ణయం, వణుకు, టిడిపి క్లోజ్!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో టిడిపి అంటే రేవంత్ గుర్తుకు వస్తారు. ఆయన టిడిపిని వీడితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయినట్లే అంటున్నారు.

ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

రేవంత్‌తో పాటు సీతక్క, ఒంటేరు ప్రతాప్ రెడ్డి వంటి కీలక టిడిపి నేతలు కూడా టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెంట నడిచే అవకాశముంది. ఎలా చూసినా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి బూస్ట్. టిడిపి పని ఖతమైనట్లే అంటున్నారు.

రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి సంచనలం, కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు

కాంగ్రెస్‌కు బూస్ట్ కానీ

కాంగ్రెస్‌కు బూస్ట్ కానీ

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరిక ఆ పార్టీకి మంచి ఉత్సాహమే. కానీ ఆయన పెట్టిన షరతులు కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. అప్పటికే టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న వారిని నీరుగార్చేలా ఉంది. కాబట్టి రేవంత్ డిమాండ్లపై కాంగ్రెస్ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తోంది.

బిజెపిలోను ఆందోళన

బిజెపిలోను ఆందోళన

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిక భయం బిజెపిలోను కనిపిస్తోంది. తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బిజెపి చాలా రోజులుగా చెప్పుకుంటోంది. దక్షిణాదిపై బిజెపి పెద్దలు దృష్టి సారించారు. తెరాసకు ధీటుగా ఎదిగే ఉద్దేశ్యంలో భాగంగానే పొత్తుపై ఇటు టిఆర్ఎస్, అటు బిజెపి ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్నాయి. బిజెపికి టిఆర్ఎస్ దగ్గరవుతోందనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. కానీ దీనిని ఇరు పార్టీలు కొట్టి పారేస్తున్నాయి.

వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్న టిఆర్ఎస్, బిజెపి

వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్న టిఆర్ఎస్, బిజెపి

ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. అక్కడ ఆ పార్టీకి ధీటుగా ఎదిగేందుకు బిజెపికి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంతోకొంత అడ్డు వస్తోంది. తెలంగాణలో ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు టిఆర్ఎస్, బిజెపిలు దూరం పాటిస్తున్నాయి. 2019 నాటికి టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదుగుతామని బిజెపి భావించింది.

బిజెపికి రేవంత్ నిర్ణయం షాక్

బిజెపికి రేవంత్ నిర్ణయం షాక్

కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయం బిజెపికి పెద్ద షాక్‌లా మారిందని అంటున్నారు. 2014 వరకు సమైక్య ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఆ తర్వాత పలువురు తెరాసలో చేరడంతో ఆ పార్టీ క్రమంగా బలహీనపడింది. అదే సమయంలో బిజెపి పుంజుకోవడం ప్రారంభించింది. కొద్ది రోజులుగా తిరిగి కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోంది. ఇప్పుడు రేవంత్ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి వేయి ఎనుగుల బలం.

టిడిపి క్లోజ్, కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహం

టిడిపి క్లోజ్, కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరింత ఉత్సాహం, ఊపు వస్తాయి. విభజన తర్వాత, ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణలో టిడిపి అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే టిడిపిలా కనిపించింది. కేవలం రేవంత్ ధైర్యం చూసుకొని తెలంగాణలో టిడిపి బలంగా ఉందని తెలుగు తమ్ముళ్లు చెప్పేవారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరితో టిడిపి క్లోజ్ కావడంతో పాటు టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న బిజెపికి ఎదురుదెబ్బ తగిలినట్లే. ఎందుకంటే కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహం వస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Congress has put a plan in place in Telangana to regroup itself in the hope that it will help build the much needed momentum for the party nationally, taking a leaf from its performance when Andhra Pradesh was a unified state contributing to the formation of UPA II.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి