పోటీ చిత్రాలు: అటు కెసిఆర్, ఇటు బాబు (ఫొటోలు)
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన 34వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీకు మీరే, మాకు మేమే అన్నట్లుగా వ్యవహరించాయి. శుక్రవారం స్థానిక ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం తమకు కేటాయించిన భవనంలో తమతమ రాష్ట్రాల్లో పేరు పొందిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక సంఘాలకు స్టాళ్లు కేటాయిస్తుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రనికి ఇక్కడ ఒక భవనం ఉండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఏడాది అదే భవనాన్ని ఎపి, తెలంగాణలు పంచుకున్నాయి. కింది ఫ్లోర్‌లో ఆంధ్రప్రదేశ్, మొదటి అంతస్థులో తెలంగాణ తమతమ స్టాళ్లను నెలకొల్పాయి. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒకే భవనంలో రెండు అంతస్థులు ఉండటంతో వినియోగదారులు కింది అంతస్థులో ప్రవేశించి, పై అంతస్థు నుంచి బయటకు వెళుతుంటారు.
ఈసారి మాత్రం అలాంటి అవకాశం లేకుండా రెండు రాష్ట్రాలు వేర్వేరు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తమ వ్యాపారం తగ్గిపోతుందేమోనని ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన ప్రతినిధులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు అధిగమిస్తాం : వేణుగోపాలాచారి
ఐఐటిఎఫ్‌లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం పాల్గొంటోందని, ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. తెలంగాణ పెవిలియన్‌ను ఆయన ప్రారంభించారు.

బిర్యానీకి కూడా..
తొలి ఏడాది కావటంతో పరస్పర అంగీకారంతో ఎపి, తెలంగాణలు ఒకే భవనాన్ని పంచుకున్నాయని వేణుగోపాలాచారి అన్నారు. ఈ ఏడాది ఐఐటిఎఫ్‌లో హైదరాబాద్ బిర్యానీ, కరాచీ బేకరీ బిస్కెట్లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఉత్పత్తులు ఇలా..
ప్రదర్శనలో తెలంగాణ ఉత్పత్తులను వేణుగోపాలాచారి పరిశీలించారు. ఇలా ప్రదర్శనలో ఆయన వాటిని పట్టుకుని చూశారు.

పోచంపల్లివే ఎక్కువ..
ఆప్కో ఉత్పత్తుల్లో ఎక్కువగా తెలంగాణకు చెందిన పోచంపల్లి వస్త్రాలే ఉంటాయి కాబట్టి స్టాళ్లలో అవకాశం కల్పించలేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పారు.

ఆంధ్రా ఉత్పత్తులకే ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని ఆంధ్రా పెవిలియన్ డైరెక్టర్ జిఎస్ రావు తెలిపారు.

ఆప్కోకు స్థానం లేదు..
చేనేత వస్తాలే విక్రయించే ఆప్కోకు ఆంధ్రప్రదేశ్ స్టాళ్లలో స్థానం కల్పించలేదు. పోచంపల్లి వస్త్రాలనే ఆప్కో ప్రదర్శిస్తుంది కాబట్టి స్థానం కల్పించలేదని ఎపి అధికారులు అంటున్నారు

చంద్రబాబు బొమ్మ..
తెలంగాణ స్టాల్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిత్రాలు కనిపిస్తే, ఆంధ్ర స్టాల్స్‌లో చంద్రబాబు చిత్రాలు కనిపించాయి.












Click it and Unblock the Notifications