యుద్ధానికి సిద్ధంగా ఉండండి: ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్‌తో పది రోజుల పాటు, చైనాతో పదిహేను రోజుల పాటు యుద్ధం చేసేందుకు వీలుగా సన్నద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది.

గత వారం న్యూఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎఫ్ చీఫ్ ధనోవా ఈ మేరకుకమాండర్లకు సంకేతాలు పంపించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

indian air force

ఒకవేళ పాకిస్తాన్‌తో పది రోజుల యుద్ధం, చైనాతో పదిహేను రోజుల యుద్ధం వస్తే సత్వరమే ఎదుర్కొనేందుకు వీలుగా ఐఏఎఫ్ కమాండర్లు సర్వసన్నద్ధంగా ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆదేశించారని, అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారని వెల్లడించినట్లుగా వచ్చాయి.

తన అన్ని విభాగాల సన్నద్ధత ఎలా ఉందో తెలపాలంటూ ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్‌పెక్షన్‌కు ఆదేశాలు అందాయి. ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని, యుద్ధ విమానాలను పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్ రాడర్ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని సూచనలు అందాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Air Chief Marshal B.S. Dhanoa has directed the IAF commanders to prepare for short duration but intense wars.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి