కెసిఆర్‌పై అంచనా ఇదీ: తెలంగాణలో పొత్తులపై బాబు ఇలా..

Recommended Video

    TRS government failures : Chandrababu strategy on KCR | Oneindia Telugu

    హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధైర్యం నూరిపోశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

    వచ్చే నెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు నుంచి మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు తెలంగాణ అంతటా పల్లెపల్లెన తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు రాష్ట్ర నేతలకు చంద్రబాబు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేతలందరితో శుక్రవారం సుదీర్ఘంగా ఐదు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు.

    తెలంగాణ నేతలతో చంద్రబాబు ఇలా...

    తెలంగాణ నేతలతో చంద్రబాబు ఇలా...

    పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో మొదట గంటన్నర, ఆ తరవాత ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. గత నెలరోజులుగా తెలంగాణలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలపై రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వివరణ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు.

     తెలంగాణలో పొత్తులపై ఇప్పుడే వద్దు...

    తెలంగాణలో పొత్తులపై ఇప్పుడే వద్దు...

    పొత్తులు, సీట్ల పంపకం వంటి అంశాలపై ఎన్నికల సమయంలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక మీదట వారానికో సారి తెలంగాణ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని, నెలకు ఒకసారి హైదరాబాద్‌లో సమీక్ష జరుపుతానని చెప్పారు. పార్టీ ముఖ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవులను వెంటనే సమర్థులతో భర్తీ చేసుకోవాలని కూడా చెప్పారు.

    పవన్ కల్యాణ్ గురించి ఇలా...

    పవన్ కల్యాణ్ గురించి ఇలా...

    పవన్‌కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యల గురించి తెలంగాణ నేతలు సమావేశంలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలనే ఉద్దేశం పవన్‌ కల్యాణ్‌కు ఉన్నట్టుందని చంద్రబాబు చెప్పారు. అయితే జగన్‌కు, కాంగ్రెస్‌కు పోలవరం నిర్మాణం పూర్తి కావడం ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

     కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇలా..

    కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇలా..

    కెసిఆర్ నేతృత్వ ప్రభుత్వ పనితీరు బాగా లేదని తెలంగాణ నేతలు చంద్రబాబుకు చెప్పారు. గత ఆరునెలలుగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గ్రాఫ్‌ పడిపోతోందని, తెలంగాణ కోసం ఉద్యమించిన వర్గాలే నేడు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నాయని చంద్రబాబుకు తెలంగాణ నేతలు వివరించారు.

    మురళి హత్యోందంతంపై ఇలా..

    మురళి హత్యోందంతంపై ఇలా..

    ఉద్యోగాలు రావడంలేదని ఇటీవల ఉస్మానియా విద్యాలయంలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని తెలంగాణ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు, కొలువుల కోసం కొట్లాట సభ కూడా విజయవంతమైందని వారు చెప్పారు. నామా నాగేశ్వరరావు, అరవిందకుమార్‌గౌడ్‌, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి, అమర్‌నాథ్‌బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+