మాపై కాదు.. ఫోకస్ కేంద్రంపై పెట్టండి, శ్వేతపత్రంతో పనిలేదు: పవన్‌కు దిమ్మతిరిగే షాక్
అమరావతి: విభజన హామిల అమలుకు నోచుకోక అన్ని విధాలా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ లో.. ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయి పార్టీలు. ఇలాంటి తరుణంలో రాజకీయాలను పక్కనపెట్టి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ బయలుదేరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Recommended Video

నిధుల విషయంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని లెక్కలు అడిగామని.. రెండు ప్రభుత్వాలు స్పందిస్తే ఎవరిది తప్పో కమిటీ తేలుస్తుందని అంటున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడానికి వెనుకాడుతుందన్న విమర్శలున్నాయి.
ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని మరోసారి లేవనెత్తిన పవన్ కల్యాణ్ దానిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పవన్ డిమాండ్ సంగతి సరే, మరి బాబు మనసులో ఏముంది?

కోర్‌కమిటీ సమావేశం:
కేంద్రంపై పోరాటానికి సంబంధించి మున్మందు ఎలా వ్యవహరించాలో నాయకులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం మంగళవారం తన నివాసంలో కోర్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలను, కేంద్రాన్ని ఒప్పించడంలో అనుసరించాల్సిన పంథాను గూర్చి చర్చించారు. అదే సమయంలో పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ పై కూడా స్పందించారు.

ఫోకస్ మాపై కాదు.. కేంద్రంపై పెట్టండి..: చంద్రబాబు
పవన్ గతంలో పోలవరంపై శ్వేత పత్రం అడిగారు. మనం అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టాం. అసెంబ్లీలో ప్రకటించాం. వెబ్‌సైట్‌లో పెట్టాం. ఇంకా శ్వేత పత్రం అవసరం ఏముంది?.నాలుగేళ్లుగా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో నిజ నిర్ధారణ కమిటీ పరిశోధన చేయాలి.
వచ్చినవి రాష్ట్రం ఏం చేసిందన్నది కాదు! ఇచ్చిన నిధులను ఏంచేశారన్నది కేంద్రం చూస్తూనే ఉంటుంది. కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన వాటిపై ఫోకస్ పెట్టాలి తప్ప రాష్ట్రంపై పెడితే వచ్చే ప్రయోజనమేమీ లేదు. అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టడానికి మనం నిత్యం సిద్ధం. దానికి వెనుకాడేది లేదు.

అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా?:
కోర్ కమిటీ సమావేశంలో పోలవరంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే.. ఓవైపు అవసరమేముంది? అంటూనే మరోవైపు మేమెందుకు వెనుకాడుతాం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టు అర్థమవుతోంది. అంతేకాదు, ఫోకస్ అంతా కేంద్రంపై ఉండాలె తప్ప.. రాష్ట్రంపై ఉండకూడదు అంటున్నారు. అంటే, నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగకూడదు అని చంద్రబాబు పరోక్షంగా చెబుతున్నారన్నమాట.

పవన్ నిలదీసి అడగ్గలరా?:
చంద్రబాబు-పవన్ కల్యాణ్ ల మధ్య అంతర్గతంగా ఏదో సఖ్యత కొనసాగుతోందన్న విమర్శ ముందు నుంచి ఉంది. అందులో నిజం లేదు అని నిరూపించుకోవాలంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ ముందు మరో అవకాశం ఉన్నట్టే. ఒకవేళ చంద్రబాబు గనుక పోలవరంపై శ్వేతపత్రం విడుదలకు మొండికిపోతే.. పవన్ కల్యాణ్ ఆయన్ను గట్టిగా నిలదీసి అడగగలరా?.. కేంద్రాన్నే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అంత సూటిగా విమర్శించగలరా?.. అన్నవి ఇప్పుడు తెరపైకి వస్తున్న ప్రశ్నలు.

పవన్‌కు బాబు పెద్ద ఝలకే..:
పోలవరంపై శ్వేతపత్రం అవసరమేముంది?.. లేదా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలతో ఏం పని?, మీ ఫోకస్ కేంద్రంపై పెట్టండి లాంటి వ్యాఖ్యలు.. సమాధానం చెప్పలేక తప్పించుకుపోవడమే అన్నట్టు కనిపించడంలో అతిశయోక్తి లేదు. పవన్ స్వయంగా అడిగినా.. బాబు నోటి నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయంటే.. జనసేనానికి ఇదో పెద్ద ఝలక్ అనే చెప్పాలి.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications