చంద్రబాబు కోసం సచివాలయంలో పోష్ డైనింగ్ హాల్
హైదరాబాద్: సచివాలయంలో తన కోసం అత్యంత అదునాతనమైన పోష్ డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేసుకోబోతున్ారు. అందులో అధునాతనమైన సాంకేతిక పరికరాలుంటాయి. తన జపాన్, ఇతర విదేశాల పర్యటననలో ఆ విషయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పెట్టుబడులు పెట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం చర్చలు జరపడానికి పలువురు విదేశీ ప్రముఖులు ఆయన కార్యాలయానికి వస్తుంటారు. విదేశీ ప్రముఖులకు మధ్యాహ్న, రాత్రి విందులు ఏర్పాటు చేయడానికి విశాలమైన డైనింగ్ హాల్ కావాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయం వెనక భాగంలో విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ హాల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. ఒకే సమయంలో 20 మంది కూర్చోవడానికి వీలుగా ఆ గది నిర్మాణం జరుగుతోంది.
బఫే, సిట్ డౌన్ మీల్ విధానాలు ఈ హాల్‌లో ఉంటాయి. ఖరీదైన బల్లలు, క్రాకరీ కొనుగోలు చేస్తున్నారు. డెకోర్, లైటింగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఈ డైనింగ్ హాల్‌ను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడుతారు. విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. మామూలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేసిన గదిని ఉపయోగిస్తారు. ఈ డైనింగ్ హాల్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితం కావాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
ఈ డైనింగ్ హాల్ నిర్మాణం వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా సాగిస్తున్నారు. అయితే, ఆ విషయం బయటకు పొక్కడంతో అధికారులు కాస్తా ఆశ్చర్యానికి గురైనట్లు ఓ ఆంగ్లదిన పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications