వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ అమెరికా నీనాపై జాతి వివక్ష వ్యాఖ్య(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మిస్ అమెరికాగా ఎంపికైన తెలుగమ్మాయి నీనా దావులూరి పైన జాతి వివక్ష వ్యాఖ్యల దాడి మొదలైంది. సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఆమె జాతీయతకు సంబంధించి ట్వీట్స్ కనిపించాయి. తనపై వచ్చిన ట్వీట్స్‌ను నీనా మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. తాను వాటికి అతీతమని, తనను తాను అమెరికన్‌గానే భావిస్తానని చెప్పారు.

న్యూయార్క్ నుండి వెళ్లిపోవాలని, నువ్వు ఉగ్రవాదిలా ఉన్నావని, అల్‌ఖైదా.. నీకు అభివందనాలు.. మా మిస్ అమెరికా.. మీ అల్‌ఖైదాలో ఒకటి.. అంటూ ట్వీట్స్ చేశారు. మిస్ అమెరికా? యు మీన్ మిస్ 7-11, 9/11 నాలుగు రోజుల క్రితం వెళ్లిందని, ఆ తర్వాత నీనా మిస్ అమెరికాగా ఎంపికయిందంటూ ఆమె గెలుపుపై సామాజిక వెబ్‌సైట్లలో కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా, న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో జరిగిన అందాల పోటీల్లో నీనా దేవులూరి మిస్ అమెరికాగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆమెను జడ్జిలు విజేతగా ప్రకటించగానే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆనంద బాష్పాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆమె లేత పసుపు పచ్చ వర్ణంలోని సాయంకాలపు గౌనులో మెరిసింది. మిస్ అమెరికాగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయురాలైనందుకు తనకు గర్వంగా ఉందన్నారు.

మిస్ అమెరికా 2014:

మిస్ అమెరికా 2014:

ప్రవాసభారతీయురాలు నీనా దువులూరి మిస్ అమెరికా 2014 కిరీటాన్ని కైవసం చేసుకొన్నారు. ఈ బ్రూక్లీనైట్ హాగన్ నేషన్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అంబాసిడర్ గా నీనా అట్లాంటిక్ సిటీ కిరీటాన్ని దక్కించుకొన్నది.

మిస్ న్యూయార్క్:

మిస్ న్యూయార్క్:

నీనా రెండవ వరుస మిస్ న్యూయార్క్ గా మిస్ అమెరిక టైటిల్ ను పొందింది.

భారతీయ అమెరికన్ నివాసస్థానం:

భారతీయ అమెరికన్ నివాసస్థానం:

నీనా సైరాకస్ లో స్థిరపడ్డారు. ఈ పోటీలో గెలిచిన మొదటి భారతీయ మహిళ నినా. నినా స్వస్థల, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, క్రిష్ట జిల్లాకు చెందిన విజవాడ అమ్మాయి.

మిస్ అమెరికా కిరీటాన్ని ధరిస్తూ:

మిస్ అమెరికా కిరీటాన్ని ధరిస్తూ:

2013లో మిస్ అమెరికా కిరీటాన్ని పొందిన మెలొరీ హాగన్, నినాకు మిస్ అమెరికా 2014 కిరీటాన్ని ధరించారు.

డ్యాన్స్:

డ్యాన్స్:

2014మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకొన్న నీనా క్లాసిక్ బాలీవుడ్ డ్యాన్స్ ను అలరించింది.

తొలి ప్రవాస భారతీయురాలు:

తొలి ప్రవాస భారతీయురాలు:

2014మిస్ అమెరికా కిరీటాన్ని పొందినప్పుడు నినా చాలా ఉద్వేగభరితంగా కనిపించింది. ఈ అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం చేసుకొన్నతొలి ప్రవాస భారతీయురాలుగా చాలా గర్వపడుతన్నానన్నారు.

బరువు తగ్గినప్పుడు:

బరువు తగ్గినప్పుడు:

నినా ఆస్తమాతో బాధపడింది. ఆమె హెల్తీ డైట్ ను తీసుకుంటూ బరువు తగ్గించి, అందంగా, నాజూగ్గా తయారైంది. క్యాండిస్ పెల్లెటైర్ నియాన్ లైమ్ గ్రీన్ కలర్ స్విమ్ సూట్ లో మిస్ అమెరికా ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చింది.

మిస్ అమెరికా షూ పరేడ్:

మిస్ అమెరికా షూ పరేడ్:

మిస్ అమెరికా 2014కిరీటాన్ని పొందేన ముందు రోజు, నినా అట్లాంటిక్ సిటి బోర్డ్ వాక్ లో మిస్ అమెరికా షూ పరేడ్ కు హాజరైంది. ఈ కార్యక్రమానికి ఆమె స్ట్రాప్ లెస్ రెడ్ గౌన్ ధరించారు. ఈ పరేడ్ షోలో ఆమె ధరించిన షూ ఇవి.

అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో

అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో

మిస్ అమెరికాగా ఎంపికైన అనంతరం అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో తెలుగమ్మాయి నీనా దావులూరి ఆనందోత్సాహ దృశ్యం.

English summary
City based relatives of Nina Davuluri, who today became the first Indian-origin contestant to win the Miss America pageant, said the newly-crowned beauty queen had not forgotten her roots and still liked Indian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X