Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీపోలీస్ నివ్వెర, బాబుతో కేసీఆర్ ఇక చెడుగుడు!?

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. తెరాస ప్రభుత్వ ఆదేశంతోనే తెలంగాణ పోలీసులు ఈ పని చేస్తున్నారని ఏపీ పోలీసులు అంతర్గతంగా నిర్ధారణకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై దర్యాఫ్తుకు కూడా ఆదేశించారని సమాచారం.

వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఏపీ పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండేవారు, ఆయన సన్నిహితులు, ముఖ్య అధికారులు, కొందరు రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి.

ఫోన్ల ట్యాపింగ్‌కు అవసరమైన ఆధునిక పరికరాలను ఉమ్మడి ఏపీలోనే పోలీసు శాఖ సమకూర్చుకుంది. గతంలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఫోన్లను ఇలా ట్యాప్ చేస్తారని తాము ఊహించలేదని చెబుతున్నారు. దీనిని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Governor nod must to charge Chandrababu: KCR undecided

ఉమ్మిడి రాజధాని అయినంత మాత్రాన ఇది సరికాదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై అవసరమైతే, ఆధారాలుంటే ఎంతటి వారల పైన అయినా కేసు పెట్టేందుకు ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పైన స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.

మరోవైపు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ప్రశ్నిస్తారా అనే చర్చ సాగుతోంది. ఈ కేసులో చంద్రబాబు గురించి మరింత సమాచారం బయటపెట్టాలని తెరాస భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో మరికొందరి పేర్లు బయటపెట్టవచ్చునని అంటున్నారు.

ఏసీబీ విచారణలో రేవంత్ రెడ్డి ఏం చెబుతారు.. తద్వారా, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని తెరాస భావిస్తోందని సమాచారం. ఏసీబీ అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలతో టీడీపీని, చంద్రబాబును ఆడుకోవాలని తెరాస సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం.

అయితే, ఏసీబీ అధికారులకు రేవంత్ రెడ్డి ఇచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. గతంలో మైనింగ్ కేసులో నాటి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వెళ్లి సీబీఐ ప్రశ్నించింది. అలాగే ఇప్పుడు ఏసీబీ చంద్రబాబు ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

మరోవైపు, గవర్నర్ నరసింహన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నారు. జూన్ 9న ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. రేవంత్ రెడ్డి అంశం గురించి ప్రధాని, రాష్ట్రపతితో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+