251 మంది టీడిపి నేతలపై కేసుల ఎత్తివేత: బాబుకు 'ఆళ్ల' చిక్కులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 251 మంది టిడిపి నేతలపై కేసులను ఎత్తివేస్తూ ఏకంగా 120 వరకు జీవోలు ఇచ్చారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టుకెక్కారు. దానిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదోశించింది.

అది ఒక రకంగా చంద్రబాబు ప్రభుత్వానికి సమస్యనే. ఎత్తివేసిన కేసులు ఏ మేరకు తీవ్రమైనవి, వాటి స్వభావం ఏమిటనేది క్రోడీకరించి ఇవ్వాలని హైకోర్టు ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సూచించింది. ఉపసంహరించిన ఆ 251 కేసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నవేనని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.

ప్రభుత్వానికి ఏ కేసులు పడితే ఆ కేసులను ఉపసంహరించుకునే హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేస్తోంది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జె. ఉమాదేవి బెంచ్ ముందు విచారణకు వచ్చింది.

అధికారం ఉంటుంది గానీ....

అధికారం ఉంటుంది గానీ....

అనవసరమైన కేసులను ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది గానీ స్వభావంలో తీవ్రమైన, ఘోరమైన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇది చంద్రబాబును నైతికంగా ఇరకాటంలో పెట్టే వ్యాఖ్య అని చెప్పక తప్పదు.

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
వీరిపై కేసుల ఉపసంహరణ...

వీరిపై కేసుల ఉపసంహరణ...

ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కెఈ కృష్ణమూర్తి, చినరాజప్పలపై మాత్రమే కాకుండా ఎమ్మెల్యే బాలకృష్ణ,స్పీకర్ కోడెల శివప్రసాద్‌లపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకున్నారని ఆళ్ల తన పిటిషన్‌లో చెప్పారు. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిడిపి కార్యకర్తలపై కేసులను కూడా ప్రభుత్వం ఎత్తేసిందని చెప్పారు.

పాలక పార్టీని ఆశ్రయిస్తే చాలు....

పాలక పార్టీని ఆశ్రయిస్తే చాలు....

ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫున హైకోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. కేసుల ఉపసంహరణ విషయంంలో ప్రభుత్వం తప్పుడు సంకేతాలను పంపుతోందని ఆయన అన్నారు. ఎవరైనా నేరాలు చేసినవారు పాలక పార్టీని ఆశ్రయిస్తే మాఫీ అవుతాయనే సంకేతాలను ఈ వ్యవహారం పంపుతోందని ఆయన అన్నారు. మహిళలపై, పిల్లలపై, సమాజంలోని నిస్సహాయులపై తీవ్రమైన నేరాలను ప్రోత్సహించిన టిడిపి నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నట్లు ఆయన ఆరోపించారు.

కేసులను విడదీయండి...

కేసులను విడదీయండి...

కేసులను విడదీసి ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. నేరం, ఏ సెక్షన్ కింద నిందితుడిపై అభియోగం మోపారనే విషయాలను ప్రతి కేసు విషయంలోనూ క్రోడీకరించి సమర్పించాలని సూచించింది. వర్గీకరించిన పత్రాన్ని తమకు సమర్పించాలని సూచించింది. కేసును వచ్చేవారానికి వాయిదా వేసింది.

చంద్రబాబుకు చిక్కులే....

చంద్రబాబుకు చిక్కులే....

దాదాపు 250 కేసులను ఉపసహరించుకుంటూ 120 దాగా జీవోలను జారీ చేసిన విషయం హైకోర్టు దృష్టికి రావడం చంద్రబాబును నైతికంగా చిక్కుల్లో పెట్టేదే. ఆ కేసులు ఎంత తీవ్రమైనవనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి సమర్పించే పత్రం ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Hyderabad High Court on Tuesday directed YSRCP MLA Alla Ramakrishna Reddy, who questioned 120 GOs issued by AP withdrawing cases against 251 TDP leaders, to classify the cases duly indicating the gravity and nature of the cases.
Please Wait while comments are loading...