కెసిఆర్! అన్నింటికి డబ్బులున్నాయా, కెటిఆర్ వింత వాదన! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యల వంటి కీలక అంశంపై ప్రభుత్వం చర్చకు పారిపోయిందని విపక్షాలు ఆరోపించాయి. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న ప్రభుత్వం.. రైతులకు ఒకేసారి రుణమాఫీని ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
శాసనసభను అర్థాంతరంగా వాయిదా వేయడం పైన విపక్షాలు గురువారం నాడు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, టిడిపి, బిజెపి వైసిపి, సీపీఎం, సీపీఐలు ఆందోళనకు చేశాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం, ఉమ్మడిగా నిరసన గళమెత్తడం ఇదే మొదటిసారి.
గురువారం సభ వాయిదా ప్రకటన వెలువడగానే విపక్ష పార్టీల నేతలు సీఎల్పీ నేత జానారెడ్డి ఛాంబర్‌లో సమావేశమై.. ఉమ్మడిగా ఆందోళన చేయాలని నిర్ణయించారు. నినాదాలు చేస్తూ బయటికి వచ్చి గన్‌పార్క్ ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వంపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా పథకాలు అమలు చేస్తామంటున్న ప్రభుత్వం అన్నం పెట్టే రైతులకు రుణమాఫీ ఒకేసారి చేయలేదా అని ప్రశ్నించారు. రైతులకు డబ్బుల్లేవా అన్నారు. నిత్యం ధనిక రాష్ట్రమని చెబుతున్నారని, అలాంటప్పుడు రుణమాఫీ చేస్తే ఏమిటన్నారు.
రుణమాఫీపై కేంద్రాన్ని డిమాండ్ చేయడంపై బిజెపి నేతలు స్పందిస్తూ... కేంద్రాన్ని అడిగి హామీ ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ - బిజెపి, ఇతర విపక్షాల కలయికను మంత్రి కెటిఆర్ పాము - ముంగీస కలయిక అన్నారు. దీనిపై స్పందిస్తూ... కీలకమైన రైతుల సమస్యలపై విపక్షాలు ఒక్కటైతే అలా మాట్లాడటం విడ్డూరమని, ప్రజా సమస్యల పైన అందరూ ఒక్కటి కావాల్సిందేనని చెబుతున్నారు. కెటిఆర్‌ది వింత వాదనగా అభిప్రాయపడుతున్నారు.

విపక్షాల ఆందోళన
విపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యేలు వివేకాంద, అరికెపూడి గాంధీ, రాజేందర్ రెడ్డి, వైసిపి నేత పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం, సీపీఐ సభ్యులు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్‌లతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విపక్షాల ఆందోళన
విపక్షాల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జీవన్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్, రామ్మోహన్ రెడ్డి తదితరులను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్‌లో చేర్చారు.

విపక్షాల ఆందోళన
వీరితోపాటు జానారెడ్డి, విపక్షాల నేతలను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లోనూ నేతలు నిరసన కొనసాగించారు.

విపక్షాల ఆందోళన
ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి సభ్యుడు రామచంద్ర రావులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీరితోపాటు టిడిపి తెలంగాణ అధ్యక్షులు రమణ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు స్టేషన్‌కు వచ్చి అరెస్టైన నేతలకు సంఘీభావం తెలిపారు.

విపక్షాల ఆందోళన
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని, రైతు సమస్యలపై సభలో బైఠాయిస్తే బలవంతంగా బయటికి పంపించారని జానారెడ్డి ధ్వజమెత్తారు. సభను అర్థాంతంగా వాయిదా వేశారని ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్టు చేశారన్నారు.

విపక్షాల ఆందోళన
ప్రభుత్వం దిగివచ్చే వరకు విపక్షాల ఐక్యపోరాటం కొనసాగుతుందన్నారు. సభ ప్రారంభమవగానే ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సభను అర్థాంతరంగా వాయిదా వేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ రైతులపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని రమణ ధ్వజమెత్తారు.

విపక్షాల ఆందోళన
రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రుణమాఫీ రైతులకు గుదిబండగా మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

విపక్షాల ఆందోళన
ఏకమొత్తంగా రుణమాఫీ చేయమంటే ఏకంగా సభనే వాయిదా వేయడం రైతులను అవమానించడమేనని జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు.

విపక్షాల ఆందోళన
ప్రతిపక్షాలు నిలదీస్తే అరెస్టులు చేయించడం దారుణమని డీకే అరుణ, గీతారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయమంటే సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేశారని వివేక్ విమర్శించారు.

విపక్షాల ఆందోళన
ఎమ్మెల్యేల ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ములేక ప్రభుత్వం అరెస్టులకు పూనుకుందని తమ్మినేని వీరభద్రం అన్నారు.

విపక్షాల ఆందోళన
విపక్షాల ఒత్తిడితో దిక్కుతోచకే సభను వాయిదా వేశారని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications