వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి దూరంగా భారత్ అడుగు! 85 నుంచి 76కు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బెర్లిన్‌కు చెందిన అవినీతి వాచ్‌డాగ్.. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టిఐ) భారత్ అవినీతిలో తగ్గుతోందని తేల్చింది. 168 దేశాల జాబితాలో అవినీతిలో భారత్ 76వ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 85వ స్థానంలో నిలిచింది. భారత్ 9 స్థానాలు ముందుకు వచ్చింది. అయితే, మార్కుల్లో మాత్రం మార్పు లేదు.

గత ఏడాది వచ్చినట్లే ఈసారి కూడా 38 మార్కులే వచ్చాయి. అతితక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్‌ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదికను రూపొందించారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 168 దేశాలకు దీంట్లో మార్కులను, ర్యాంకులను కేటాయించారు. థాయ్‌లాండ్, బ్రెజిల్‌, ట్యునీషియా, జాంబియా, బుర్కినా ఫాసో దేశాలు కూడా భారత్‌లాగే 76వ ర్యాంకును పొందాయి. మొదటి స్థానంలో నిలిచిన డెన్మార్క్‌కు 91 మార్కులు లభించాయి.

India ranks 76 in Corruption Perception Index

కేవలం 8 మార్కులతో ఉత్తర కొరియా, సోమాలియా జాబితాలో చివరలో నిలిచాయి. భూటాన్‌ 65 మార్కులతో 27వ స్థానంలో, చైనా 37 మార్కులతో 83వ స్థానంలో, పాకిస్థాన్‌ 30 మార్కులతో 117వ స్థానంలో, బంగ్లాదేశ్‌ 25 మార్కులతో 139వ స్థానంలో నిలిచాయి.

అవినీతిసూచి తయారీకి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ కొన్ని ప్రమాణాలను తీసుకుంది. ప్రభుత్వరంగంలో ఉన్న అవినీతి ఆధారంగా 0 (అత్యంత అవినీతి) నుంచి 100 (అవినీతిరహిత) కొలబద్దపైన వివిధ దేశాలకు మార్కులనిచ్చారు. అదేవిధంగా ఇతర దేశాలతో పోల్చితే ఒక దేశం అవినీతిసూచిపై ఎక్కడుంది అని చెప్పటం కోసం ర్యాంకులను కేటాయించారు.

English summary
The Berlin-based corruption watchdog Transparency International (TI) has put India at rank 76 out of 168 countries in its latest Corruption Perception Index.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X