విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఊగిసలాట: అనుభవరాహిత్యమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అనుభరాహిత్యం వెంటాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వ్యూహరచనలో, దాన్ని అమలు చేయడంలో వైయస్స్రార్ కాంగ్రెసు పార్టీ అనుభవ రాహిత్యం కనిపిస్తోందని, అందుకు శాసనసభలో వైయస్ జగన్ అనుసరించిన వ్యూహమే నిదర్శనమని అంటున్నారు. గతంలో రాష్ట్ర విభజన విషయంలోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలోనూ జగన్ ఊగిసలాట ధోరణి ప్రదర్శించి, కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాజకీయ ప్రయోజనాలు సాధించుకుంటూ ముందుకు సాగడంలో వైఎస్సార్‌ సిపి విఫలమైందని, స్థిరమైన నిర్ణయం తీసుకోవడంలో అచేతనంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. విభజన విషయంలో జగన్‌ పార్టీ ఒకవైపు మొగ్గడం వరకు కొంతమేరకు ఫలితం సాధించినప్పటికీ, దాని ఫలితాలు పొందడంలో వ్యూహరచనా అమలు లోపం వల్ల విఫలమైందని అంటున్నారు.

 Inexperience haunts YS Jagan?

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరిగా దాగుడు మూతలు ఆడలేకపోయిందనే ప్రచారం వుంది. ఫలితంగా తెలంగాణలో పార్టీ ఉనికిని కోల్పోయింది. విభజన తరువాత అయినా అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోలేదు. మొత్తం కెసిఆర్‌కు వదిలేసినట్లయిందని అంటున్నారు. దానివల్ల కెసిఆర్‌కు జగన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం నష్టం చేసిందని చెబుతున్నారు.

తాజాగా ఇప్పుడు రాజధాని రూపంలో మరో సమస్య వచ్చింది. దీంతో వైయస్ జగన్ మరో సమస్యను ఎదుర్కున్నారు. నిజానికి వైయస్ జగన్ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు రెండింటా బలం పుంజుకోవడానికి ప్రయత్నించాలి. చంద్రబాబుకు కూడా రెండు ప్రాంతాలు కావాలి. కానీ చంద్రబాబు వ్యవహరించిన వ్యూహం ముందు జగన్ తేలిపోయిట్లు కనిపించారు. రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, కేంద్ర కమిటీ సిఫార్సులు వదిలేయడం వంటివి ప్రధానంగా వున్నాయి. నిజానికి ఈ విషయాలపై మాట్లాడితే ఆంధ్రకు వ్యతిరేకమనే భావన ముందుకు వచ్చి ఉండేది కాదు.

బెజవాడను ఏకపక్షంగా జగన్ అంగీకరించడానికి బదులు రాయలసీమకు ఇస్తున్న వరాలు ఏమిటి, వాటి వల్ల ఒరిగేదేమిటి అనే విషయాలపై జగన్ స్పష్టంగా మాట్లాడి చంద్రబాబును ఇరుకున పెట్టే కన్నా ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాదిరిగా బాబు ఏ ప్రాంత ప్రజల చేత ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడించి, హడావిడి చేసే వ్యూహాన్ని అనుసరించడంలో జగన్ విఫలమైనట్లు భావిస్తున్నారు.

English summary
According to political experts - YSR Congress party president YS Jagan has been haunted by inexperience to face Andhra Pradesh CM Nara Chandrababu Naidu on AP capital issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X