వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ సర్వే: ఒక్క రోజులో సాధ్యమా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమగ్ర సర్వే కుటుంబ సర్వే కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనకు తానే పరీక్ష పెట్టుకున్నట్లుగా ఉంది. ఒక్క రోజులు రాష్ట్రమంతా ఈ సర్వే సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్టవ్య్రాప్తంగా ఒకేరోజు 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సర్వేలో అన్ని విభాగాల ప్రభుత్వోద్యోగులు పాల్గొంటారు.

సమగ్ర కుటుంబ సర్వే నిర్వాహణపై శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖాముఖి చర్చించారు. గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలకు కేటాయించిన వేలాది కోట్ల ప్రజాధానం దుర్వినియోగం అయ్యిందని ఆయన ఈ సందర్బంగా అన్నారు. కుటుంబాల లెక్కలు ఒక్కటే కాదు, రాష్ట్రంలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్య నాలుగు లక్షలని చెబుతున్నారని, ఇది కూడా సరైన లెక్కకాదని, ఉద్యోగుల సంఖ్య ఎంత ఉందో లెక్క తెలియని పరిస్థితి ఉండటం పాలనా యంత్రాంగానికే సిగ్గుచేటని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

సంక్షేమ పథకాలకు అర్హులకు మాత్రమే అందించడానికి ఈ కుటుంబ సర్వే పనికి వస్తుందని, అక్రమాలను నిరోధించడానికి పనికి వస్తుందని చెప్పారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

పోలీసులు కూడా సివిల్ డ్రెస్‌లో ఇంటింటికి వెళ్లి సర్వే జరుపుతారు. ఒక్కో ఉద్యోగి 21నుంచి 28ఇళ్లలో సర్వే జరుపుతారు. సర్వే పూర్తయిన ఇంటికి తెలంగాణ రాజముద్ర వేస్తారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

ఇంటింటి సర్వే కోసం జిల్లాకు రెండు కోట్లు కేటాయించారు. ఎన్నికల పోలింగ్ తరహాలో ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

ఇంటింటి సర్వే కోసం ఈనెల 19న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు కార్యాలయాలు పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణపై ఈనెల 11న రెవిన్యూ ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

ఇకనుంచి అక్రమాలకు తావులేకుండా సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి వివరించారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

రాష్టవ్య్రాప్తంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఎమ్మార్వో నుంచి ముఖ్యమంత్రి వరకూ అందరి టెబుళ్లపై ఉండాలన్న ఉద్దేశంతో సర్వే చేపడుతున్నట్టు చెప్పారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

రాష్టవ్య్రాప్తంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఎమ్మార్వో నుంచి ముఖ్యమంత్రి వరకూ అందరి టెబుళ్లపై ఉండాలన్న ఉద్దేశంతో సర్వే చేపడుతున్నట్టు చెప్పారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

గత ప్రభుత్వాల హయాంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని కెసిఆర్ అన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

తప్పుడు లెక్కలతో అర్హులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అనర్హులు కొల్లగొడుతూ వచ్చారని ఇకముందు అలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు పూనుకుందని ముఖ్యమంత్రి వివరించారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

గతంలో ప్రజాధనాన్ని కాజేసిన దొంగలు ఎవరో కూడా తెలుసుకోడానికి తమ సర్వే దోహదపడుతుందని తెలిపారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో 86.20 లక్షల కుటుంబాలు ఉంటే కోటి 14 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని కెసిఆర్ అన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

తెల్ల, గులాబీ రేషన్ కార్డులన్నీ కలిపితే దాదాపు 20 లక్షల బోగస్ రేషన్‌కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కుటుంబాల కంటే ఎక్కువ ఉన్న రేషన్‌కార్డులు ఎక్కడున్నాయని, ఎవరివద్ద ఉన్నాయో తమ సర్వే నిగ్గు తేల్చనుందని అన్నారు.

తప్పుడు లెక్కలవల్ల వేలాది కోట్లు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, ఒక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికే తమ ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుండగా, పాత బకాయిలు రూ.1363 కోట్ల వరకూ ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. రేషన్‌కార్డులు, ఫించన్లు, గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అన్ని సంక్షేమ పథకాలు అన్నింట్లోనూ తప్పుడు లెక్కలేనని చెప్పారు.

రాష్ట్రంలో 84 వేల కుటుంబాలుంటే ఇప్పటికే 55 లక్షల ఇళ్లు కట్టినట్టు ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయని, ఈ లెక్కలే నిజమైతే ఇంకా ఇళ్లు నిర్మించాల్సిన అవసరమే ఉండేది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

English summary
The chief minister of Telangana K. Chandrasekhar Rao, addressing a preparatory meeting with district collectors and top revenue officials on ‘Intensive Household Survey-2014’ that aimed at weeding out fake beneficiaries of government welfare schemes, in Hyderabad on Friday. About 4 lakh employees will survey in ten district covering 86-lakh households and it will be completed in single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X