టి: కిరణ్‌లో మార్పు వస్తోందా, అందుకే జగన్‌వైపు?

Is Kiran is cooperating to High Command?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి సహకరిస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతల్లో జోరుగా సాగుతోంది. తాను సమైక్యవాదినని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రం విడపోకుండా అడ్డుకుంటానని గంటాపథంగా చెబుతున్న కిరణ్ క్రమంగా అధిష్టానానికి లొంగిపోయినట్లుగా కనిపిస్తోందంటున్నారు.

సమైక్యం బలంగా కోరుకుంటున్న పలువురు సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కిరణ్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటారని లేదా కొత్త పార్టీ పెడతారని భావిస్తున్నారు. అయితే కొంతకాలంగా కిరణ్ తీరులో మార్పు వస్తున్నట్లుగా పలువురు అనుమానిస్తున్నారట. ఈ కారణంగానే కొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ వైపు చూసేందుకు కారణమైందంటున్నారు.

విభజనను అడ్డుకుంటానని చెప్పిన కిరణ్ తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టినప్పుడు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. ఆ తర్వాత శాసన మండలిలో పరోక్షంగా కిరణే చర్చను ప్రారంభించారంటున్నారు. కిరణ్ తీరు కొంతకాలంగా చూస్తుంటే అనుమానంగా ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా దూకుడుగా వెళ్తున్న సమయంలో కిరణ్ తన అసంతృప్తిని బాహాటంగా ప్రదర్శించడమే కాకుండా మరికొన్ని విధాలుగా చూపించారంటున్నారు. పదిహేను రోజుల క్రితం వచ్చిన యాడ్‌లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోటో మిస్ అయిందని, ఇప్పుడు మాత్రం ఫోటోలు కనిపిస్తున్నాయని లాజిక్ లాగుతున్నారట. అంతేకాదు గతంలో సీమాంధ్ర నేతలతో క్లోజ్‌గా మూవ్ అయిన కిరణ్ ఇప్పుడు తెలంగాణ నేతలతో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+