వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెటిజన్ల హాట్ ఫేవరైట్ వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaganmohan Reddy is netizens' hot favourite
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యార్థి నెట్ సావీ అనే విషయం అందరికీ తెలిసిందే. నెటిజన్లకు వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ హాట్ ఫేవరైట్‌గా మారాడు. నెట్ సెర్చ్‌లో అత్యధికులు అన్వేషించిన రాజకీయ నాయకుల్లో జగన్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ విషయంలో నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి జగన్ దీటుగా నిలుస్తున్నాడు.

గత నాలుగేళ్ల కాలంలో 2009 నుంచి 2013 మధ్య కాలంలో సెర్చ్ డాటాను పరిశీలిస్తే ఏ రాష్ట్ర నాయకుడి కోసం అన్వేషించనంతగా జగన్ కోసం నెటిజన్లు అన్వేషించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిల కన్నా జగన్ పేరు సెర్చ్ రిక్సెస్ట్‌ల్లో మారుమోగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లో వైయస్ జగన్ ముఖ్య నేతగా మారిపోయారు. ఓదార్పు యాత్ర, కాంగ్రెసు పార్టీకి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు, సిబిఐ అరెస్టు వంటి ఉదంతాలతో జగన్ ఎప్పటికప్పుడు వార్తల్లో తాజా నేతగా కొనసాగుతూ వస్తున్నారు.

ఇటీవలి కాలంలో సెర్చ్ రిక్వెస్ట్‌లో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అగ్ర భాగాల్లో ఉంటే కొన్ని సందర్బాల్లో జగన్ రాహుల్ గాంధీని మించిపోయాడు. చంచల్‌గుడా జైలు నుంచి విడుదల తర్వాత జగన్ సెర్చ్ రిక్వెస్ట్‌లు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ లాగా ఆన్‌లైన్ కాంపైన్‌ను జగన్ పెద్ద యెత్తున చేపట్టకపోయినా నెటిజన్లకు ఆకర్షణగా మారిపోయాడు.

English summary

 YSRCP chief Y S Jaganmohan Reddy is not just the talk of the town but also figures amongst the most searched politicos online in India, in the same league as that of national leaders such as Narendra Modi and Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X