హీట్: కుర్చీలు ఖాళీ అని బొత్స, సమ్మెపై జానా

మంత్రులు బొత్స సత్యనారాయణ, జానా రెడ్డిలు చేసిన వ్యాఖ్యలు శుక్రవారం మంత్రి వర్గ సమావేశంలో కొంత హీట్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఐటి సంస్థలకు గతంలో రాయితీ ధరకు కేటాయించిన భూమిని తాజాగా ఆయా సంస్థలు ఇతరులకు విక్రయించుకోవడానికి అనుమతించాలన్న ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.

ఈ సమయంలో బొత్స మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలను నిర్ణయించేటప్పుడు లోతుగా చర్చించాలని, అలా చేయకపోవడం వల్లనే మంత్రివర్గంలో మూడు కుర్చీలు ఖాళీ అయ్యాయని వ్యాఖ్యానించారు. పలు అంశాల పైన మంత్రివర్గం ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని, దానికి బాధ్యత అందరు వహించాలని సూచించారు. తర్వాత ఏదైనా సమస్యలు వస్తే మాకేం తెలియదని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.

Jana Reddy and Bosta Satyanarayana

ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమ్మె ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతోందని కొందరు అపోహపడుతున్నారంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేబినెట్ సమావేశంలో కలకలం రేపాయి.

ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సమ్మెకు ప్రభుత్వ మద్దతేమీ లేదని, గతంలో తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఉద్యోగ సంఘాల ఐకాసతో ప్రభుత్వం ఏ విధంగా చర్చల ప్రక్రియను చేపట్టిందో సీమాంధ్ర ప్రాంతంలోనూ అదే న్యాయసూత్రాన్ని పాటిస్తుందని, ఈ సమస్యకు మరో పది రోజుల్లో పరిష్కారం లభించే అవకాశాలున్నాయని అన్నారు.

సీమాంధ్రలో సమైక్యాంధ్రను కోరుతూ జరుగుతున్న సమ్మెను ప్రభుత్వమే చేయిస్తోందన్న అపోహలు ఉన్నాయని, సమ్మెను కోర్టు కూడా తప్పుపడుతోందని జానా రెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వోద్యోగులు సమ్మె చేపట్టి 50 రోజులు అయిందని, ఫలితంగా అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు.

దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు రాష్ట్ర మంత్రులుగా రచ్చబండ తదితర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించామని, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. జానా వ్యాఖ్యలపై కిరణ్ స్పందించి కొద్ది రోజుల్లో కొలిక్కి వస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+