అలా ఎలా?: అమెరికా కలిపింది కడియం-ఎర్రబెల్లిని!

Subscribe to Oneindia Telugu

వరంగల్: ఒకప్పుడు వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు. వారిప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో కీలక నేతలు. ఇద్దరిదీ వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండలమే. అంతేగాక, ఇద్దరిదీ ఒకే గ్రామం కూడా. వారికి ఒకప్పుడు ఒకరంటే ఒకరికి అసలే పడదు. ఒక వర్గంపై ఒకరు దాడులు, కేసులు పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

అయితే, ఇప్పుడు మాత్రం వారిద్దరూ స్నేహితులుగా మారిపోయారు. వారిద్దర్నీని స్నేహితులుగా మార్చింది అమెరికా పర్యటన. వారే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాలకూర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు.

తొలి రోజుల్లో ఇద్దరిదీ ఒకే పార్టీ అయినా రాజకీయంగా ఉప్పు.. నిప్పులా ఉండేవారు. అనంతర రాజకీయ పరిణామాల్లో కడియం, ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయినా, పెద్దగా పలకరింపులు లేవు. అయితే, ఇటీవల ఆటా మహాసభల కోసం అమెరికా వెళ్లిన సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ సమయంలో పాఠశాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఎర్రబెల్లి కోరిన వెంటనే కడి యం శ్రీహరి రూ.22 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

అంతేగాక, సుమారు పక్షం రోజుల పాటు అమెరికాలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ ఇద్దరు నేతలు ఆటా వేడుకల సందర్భంగా మనసు విప్పి మాట్లాడుకున్నారట. అక్కడ ప్రవాస భారతీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విభేదాలు మరిచి కలిసి పని చేద్దామని అప్పుడే ఓ అంగీకారానికి వచ్చారట. దీని ఫలితమే శనివారం ఎర్రబెల్లి ఆహ్వానం మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దఎత్తున నిర్వహించిన హరితహారంలో శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తర్వాత నేతలిద్దరు వేదికపై ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు.
అమెరికా పర్యటన అనంతరం జిల్లాకు చేరుకున్న ఇద్దరూ హరితహారం కార్యక్రమంలో మరింత దగ్గరయ్యారు. అభివృద్ధి కోసం ఎర్రబెల్లి పట్టుదలతో ముందుకు సాగుతాడని కడియం అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోనే ఒకే రోజు ఎమ్మెల్యే దయాకర్‌రావు చొరవతో నాలుగు లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు.

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో పని చేస్తున్నారని, ఆయనకు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ జెండా పట్టుకుని తిరిగితే అభివృద్ధి చేయలేమని గుర్తించి దయాకర్‌రావు టిఆర్‌ఎస్‌లోకి రావడం సంతోషకరమన్నారు. దయాకర్‌రావుకు తనకు ఏనాడు వ్యక్తిగత విభేదాలు లేవని, పార్టీ పరంగా విమర్శలు సహజంగా చేసుకున్నవేనని అన్నా రు.

కాగా, కడియం ఏ శాఖ మంత్రిగా కొనసాగినా చిత్తశుద్ధితో పనిచేస్తాడని ఎర్రబెల్లి కొనియాడారు. కార్యకర్తలు సైతం ఇద్దరు నేతలనూ గజమాలతో సన్మానించారు. సోమారం గ్రామంలో భోజనం చేసిన సందర్భంగా ఎర్రబెల్లి వివిధ రకాల వంటకాలను కడియంకు కొసరి కొసరి వడ్డించడం విశేషం.

కడియం-ఎర్రబెల్లి

కడియం-ఎర్రబెల్లి

ఒకప్పుడు వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు. వారిప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో కీలక నేతలు. ఇద్దరిదీ వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండలమే. అంతేగాక, ఇద్దరిదీ ఒకే గ్రామం కూడా. వారికి ఒకప్పుడు ఒకరంటే ఒకరికి అసలే పడదు. ఒక వర్గంపై ఒకరు దాడులు, కేసులు పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

కడియం-ఎర్రబెల్లి

కడియం-ఎర్రబెల్లి

అయితే, ఇప్పుడు మాత్రం వారిద్దరూ స్నేహితులుగా మారిపోయారు. వారిద్దర్నీని స్నేహితులుగా మార్చింది అమెరికా పర్యటన. వారే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాలకూర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు.

కడియం-ఎర్రబెల్లి

కడియం-ఎర్రబెల్లి

తొలి రోజుల్లో ఇద్దరిదీ ఒకే పార్టీ అయినా రాజకీయంగా ఉప్పు.. నిప్పులా ఉండేవారు. అనంతర రాజకీయ పరిణామాల్లో కడియం, ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయినా, పెద్దగా పలకరింపులు లేవు.

కడియం-ఎర్రబెల్లి

కడియం-ఎర్రబెల్లి

అయితే, ఇటీవల ఆటా మహాసభల కోసం అమెరికా వెళ్లిన సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ సమయంలో పాఠశాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఎర్రబెల్లి కోరిన వెంటనే కడి యం శ్రీహరి రూ.22 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Deputy CM Kadiyam Srihari and MLA Errabelli Dayakar Rao changed as friends.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి