గూడ అంజయ్య కోరిక తీర్చని కెసిఆర్?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కోరికను తీర్చలేకపోయారు. హైదరాబాదులోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో గూడ అంజయ్య తనకు ఓసారి కెసిఆర్‌ను చూడాలని ఉందని చెప్పారట. అయితే, తన కోరిక తీరకుండా గూడ అంజయ్య తుదిశ్వాస విడిచారు.

నిమ్స్‌లో గూడ అంజయ్య చికిత్సకు ఏ విధమైన లోటు రాకుండా చూడాలని మాత్రం కెసిఆర్ ఆదేశించారు. అది కూడా గూడ అంజయ్యకు సంబంధించిన వాళ్లు చెప్తే కాదు, ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రముఖ జర్నలిస్టు కెఎల్ రెడ్డిపై ఓ దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని చదివి, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుని కెసిఆర్ ఉదారంగా వ్యవహరించారు. కెఎల్ రెడ్డిని తన వద్దకు పిలిపించుకుని రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందించారు. అయితే, గూడ అంజయ్యను చూడడానికి తీరిక లేకుండా ఉండడం వల్లనే కెసిఆర్‌కు వీలు కలగలేదని అంటున్నారు.

 KCR failed to fulfill Gooda Anjaiah's wish?

పాలేరు ఉప ఎన్నిక సమయంలో టిఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దింపవద్దని కోరడానికి కాంగ్రెసు దివంగత ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి సతీమణి, తెలంగాణ కాంగ్రెసు చీఫ్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, కెసిఆర్ వారిని కలవడానికి నిరాకరించారు. దీనిపై కాంగ్రెసు తీవ్ర నిరసన తెలిపింది.

కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా మాట్లాడారు. తాను రెండు సార్లు అడిగానని, కానీ కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆయన ఆ మధ్య అన్నారు. అయితే, తనకు ఇష్టం లేని విషయాలు వినడానికి ఇష్టపడకపోవడం వల్లనే కెసిఆర్ కొంత మందికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని గిట్టనివాళ్లంటే, బిజీగా ఉండడం వల్లనే ఇవ్వడం లేదని మరికొంత మంది వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+